Home News Updates

నోరువిప్పిన కియా మోటార్స్! అంతా ఫేక్!! కుండబద్దలుకొట్టిన సంస్థ లేఖ

కియా వివాదానికి వివరణ ఇచ్చింది ఆ సంస్థ. కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి తరలివెళ్ళిపోతోందంటూ వచ్చిన వార్తా, తదనంతర పరిణామాల నేపథ్యంలో స్వయాంగా ఆ సంస్థ ఓ ప్రకటన ద్వారా ఫుల్ స్టాప్ పెట్టింది.

“కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి తరలివెళ్ళిపోతోందన్న వార్తా పూర్తి బద్దం. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. భారతదేశంలో అడుగుపెట్టిన మేము 1.1 బిలియన్ డాలర్స్ అనంతపురం లో పెట్టుబడి పెట్టాం. ప్రపంచ క్లాస్ టెక్నలాజి తో అనంతపూర్ లో ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న వార్తల్ని వినియోగదారులు పట్టించుకోకూడదని తెలియజేస్తున్నాం”

పై విధంగా తన లేఖలో స్పందించింది కియా సంస్థ