Home News Politics

ఖమ్మం పార్లమెంట్ గులాబీ అభ్యర్ధి ఆయనేనా…?

ఖమ్మం గులాబి ఎంపీ అభ్యర్ధిపై బిగ్‌ డిస్కషన్‌ నడుస్తుంది. సిట్టింగ్‌కి హుళక్కేనని ఓ వర్గం .మాజీ మంత్రి తుమ్మలంటూ మరో వర్గం. ఇద్దరూ కాదూ కొత్తముఖమని ఇంకొ డిస్కషన్. ఇలా గులాబీ పార్టీలో వాడివేడి చర్చోపచర్చలు. మలుపులు తిరుగుతున్న ఎంపీ అభ్యర్ది‌ అంశం. సిట్టింగ్‌ ఎంపీ బరిలో ఉండేనా? ఎంపీగా పోటికి తుమ్మల సుముఖమేనా? కొత్తవారికి అవకాశమిస్తారా? కేసీఆర్‌ మదిలో ఏముంది? టిఆర్‌ఎస్‌ పార్టీలో రసవత్తరంగా మారిన ఖమ్మం ఎంపీ అభ్యర్ధి పై చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది….

రాష్ట్రంలోని ఎంపీ అభ్యర్ధుల విషయంలో ప్రత్యేక పరిశీలనలో ఉన్న నియోజకవర్గాల్లో ఖమ్మం ఎంపీ ఒకటని అధికారపార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేసీఆర్‌ సర్వే రిపోర్టులు ఒక కారణమైతే, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తీవ్ర ఓటమి మరోకారణంగా ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.ఈ అంశాలకు తోడు పార్టీలో నెలకొన్న గ్రూపిజం బలమైన అంశంగా పార్టీ పరిగణిస్తుంది.రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 స్థానాలను కైవసం చేసుకోవాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు.రానున్న పార్టమెంట్‌ ఎన్నికల్లో తన అంచనాలు తారుమారు కారాదని కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు.ఖమ్మం పార్టమెంట్‌ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. దీంతో ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డికి పోటికి అవకాశమిచ్చే అంశంపై సీఎం కేసీఆర్ తర్జనబర్జన పడుతున్నారన్న వాదన ఉంది. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఒకే స్థానాన్నే గెలుచుకుంది. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల పార్టీ ఓటమిపాలైంది.ఈ లెక్కన ఎంపీ ఎన్నికల్లో పార్టీకి ఎదురీత తప్పదు.

అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎకతాటిపై నడిస్తే టిఆర్‌ఎస్‌ కు మరోసారి ఓటమి తప్పదు. దీంతో ఖమ్మం సీటుపై టిఆర్‌ఎస్‌ పార్టీని ఓటమి సందేహాలు చుట్టుముడుతున్నాయి.ఫలితంగా కేసీఆర్‌ ఖమ్మం సీటు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఉత్కంఠమైన చర్చకు దారితీసింది.ఇక నేతల మద్య నెలకొన్న విభేదాలు కాస్తా బహిరంగ విమర్శల స్థాయికి వెళ్ళాయి. దీంతో ఓటమిపాలైన అభ్యర్ధులకు తుమ్మల నాగేశ్వర్‌రావు నాయకత్వం వహిస్తూ ఎంపీ శ్రీనివాసరెడ్డిపై తిరుగుబాటు ఎగురవేశారు. అంతేకాదు ఎంపీ అభ్యర్ధిగా శ్రీనివాసరెడ్డిని ఖరారు చేయరాదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. అంతేకాకుండా ఒకవేళ ఆయనకే అవకాశమిస్తే గెలుపోటములకు తాము భాద్యత వహించమని తుమ్మల టీమ్‌ నిర్ణయించుకున్నారని పార్టీలో గుగుసలు వినిపిస్తున్నాయి.మరొవైపు ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎంపీ శ్రీనివాసరెడ్డి బరిలో ఉంటాడని ఆయన వర్గీయులు బహటంగానే చెబుతున్నారు.అంతేకాదు బరిలో ఉండటమేకాదు గెలుపు ఆయనదేనని ఆయన వర్గీయులు ధీమాను వ్వక్తం చేస్తున్నారు.

దీంతో టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఖమ్మం జిల్లా ఎంపీ గా పోటీ దించడానికి ఓ కొత్త ముఖాన్ని దించబోతుందని టీఆర్ఎస్ వర్గాల్లో,జిల్లా ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుంది.మోటారు వెహికిల్స్ షోరూం అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ అలియాస్ బజాజ్ రాజా ని రంగంలో కి దించుతున్నారని జోరుగా చర్చ జరుగుతుంది. ఇతనికి మాజీ మంత్రి తుమ్మల సపోర్ట్ కూడా గట్టిగా ఉందని టాక్ నడుస్తుంది. వీరయ్య చౌదరి మరణానంతరం ఆయన కూమారుడైన రాజేంద్రప్రసాద్ ఆ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు.స్వతహాగా కాంగ్రెస్ కుటుంబం వీరిది. ప్రస్తుత ఎంపీ శ్రీనివాసరెడ్డి కి టికెట్ కేటాయిస్తే మాజీ మంత్రి వర్గం తో పాటు మరొకొంతమంది ఓటమి పాలైన ఎమ్మెల్యే అతనికి సపోర్ట్ చేస్తారో లేదో అని కొత్త వ్యక్తికి ఇస్తే అందరు కలిసి పనిచేస్తారని టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తుందంటా.

ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం రాజేంద్రప్రసాద్ అయితే విజయం తధ్యమని అందుకే అతనికి ఎంపీ సీటు కేటాయించాలని మాజీ మంత్రి తో పాటు మరొకొంత మంది ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్ అధిష్టానం దగ్గర చెప్పారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.చూడాలి మరి కేసీఆర్ ఎంపీ సీటు ప్రస్తుత ఎంపీ శ్రీనివాసరెడ్డి ఇస్తారా లేక కొత్త వ్యక్తికి కేటాయిస్తారో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here