Home News Stories

ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట…

ముందస్తు ఎన్నికల హడావిడిలో అన్ని పార్టీలు సమర రంగంలో దూకాయి. ఇక ఖమ్మంజిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది….ఒక పక్క ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దులు ప్రచారంలో దూసుకుపోతుండగా మరో పక్క మహా కూటమి అభ్యర్ధుల ప్రకటన తీవ్ర గందరగోళంగా మారింది. ఇక ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఖమ్మంలో మూడు ముక్కలాట నడుస్తుంది…

హస్తం పార్టీలో అగ్రశ్రేణి నాయక గణం అంతా ఈ జిల్లాలోనే ఉన్నారు. టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రచార కమిటీ రాష్ట చైర్మన్‌ మల్లు బట్టి విక్రమార్క, మాజి కేంద్ర మంత్రి గరికపాటి రేణుకా చౌదరి, శాసనమండలి సభ్యులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మూడు వర్గాలుగా విడిపోయి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరి ఆదిపత్య పోరులో కాంగ్రేస్‌ పార్టీ కిందస్ధాయి కేడర్ తీవ్ర అసంతృప్తికి గురవుతుంది. వీరంతా పార్టీలో తమ అనుచరుల టిక్కెట్ల కోసం టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎఐసీసీ చీఫ్ రాహుల్‌ గాంధిపై ఒత్తిడి పెంచారు.

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట,ఇల్లందు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో గులాబీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరో వైపు జిల్లాలో మహాకూటమికి చెందిన ప్రధాన భాగస్వామ్య పార్టీ అయినా కాంగ్రెస్‌ వర్గ విభేదాలతో రోడ్డెక్కుతుంది. ఖమ్మం,పాలేరు,వైరా,కొత్తగూడెం,పినపాక,భద్రాచలం,ఆశ్వారావుపేట,ఇల్లందు,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌,టిడీపీ, సిపిఐ, టిజెఎఫ్‌కు చెందిన నేతలు తమకంటే తమకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తుండటంతో జిల్లాలో పోటీ చేసే సీట్ల పై కాంగ్రెస్ లోనే క్లారిటి లేకుండా పోయింది.

హస్తం పార్టీలో కుమ్ములాటలతో పాటు వర్గవిభేదాలు తారాస్ధాయికి చురుకున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఖారారు వ్యవహారం ఆ పార్టీ అగ్రనేతల మధ్య అగ్నికి ఆద్యం పోస్తుంది. భట్టి, పొంగులేటి,రేణుకా చౌదరిలు తమ అనుచర వర్గానికి కట్టబెట్టాలని టిపీసీసీ,ఏఐసీసీకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించిన పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రధానం పోటీచేసే ప్రతి స్థానానికి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్ధులు కాంగ్రెస్ నుంచి టిక్కెట్ రేసులో ఉన్నారు.

ఖమ్మం నియోజకవర్గం నుంచి పోట్లనాగేశ్వరరావు,గాయత్రి రవి,పొంగులేటి సుధాకర్ రెడ్డి,మానుకొండ రాధాకిశోర్ కాంగ్రెస్ టిక్కెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటలాంటి పాలేరు నియోజకవర్గం ఇప్పుడు మంత్రి తుమ్మలకు ఇలాకాగా మారింది. ఇక్కడ హస్తం పార్టీ టిక్కెట్ కోసం రాయల నాగేశ్వరరావు,కందాళ ఉపెందర్ రెడ్డి,రాంరెడ్డి దామోదర్ రెడ్డి రేసులో ఉన్నారు. వైరా నుంచి ముగ్గురు నేతలు టిక్కెట్ రేసులో ఉండగా ఇల్లందు లిస్ట్ అరడజనుకు పైగానే ఉంది. పినపాక,మధిరలో భట్టీ,రేగా కాంతారావు ఉండగా ఇక్కడవీరికి పార్టీలో ఎలాంటి పోటీ లేదు. కొత్తగుడెంలో తోడళ్ళుల్లు వనమా,ఎడవల్లి మధ్య టిక్కెట్ కోసం వార్ నడుస్తుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ విషయంలో క్లారిటీ లేకపోవడం,కూటమి పార్టీలకి పొత్తులో ఏ సీట్లు ఇవ్వాలో అర్ధకాని పరిస్థితి కాంగ్రెస్ ను గందరగోళంలో పడేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here