కేరళలో ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం పినరయి విజయన్ ని మరోసారి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక మిగిలిన మంత్రులందరినీ పక్కనబెట్టింది. 11 మంది మంత్రులను నియమించుకునేందుకు సీపీఎంకు అవకాశం ఉండగా, పాత మంత్రులందరికీ ఉద్వాసన పలికింది. కరోనా సమయమంలో ఆరోగ్యశాఖమంత్రిగా మంచి పేరు సంపాదించిన శైలజకు సైతం మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు.

పినరయి విజయన్ తదుపరి ప్రభుత్వంలో మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది. శాసన సభ సభాపతి పదవికి ఎంబీ రాజేశ్‌ను, పార్టీ విప్‌గా కేకే శైలజను ఎంపిక చేసింది. పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా టీపీ రామకృష్ణన్‌ను నియమించింది. ఈ సారి మంత్రివర్గంలో యువకులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. నూతన మంత్రివర్గంలో పెను మార్పులు రాబోతున్నట్లు సీపీఎం ముందుగానే సంకేతాలు ఇచ్చింది. పినరయి విజయన్ మే 20న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.