Home News Updates

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో మొక్కలు నాటిన ప్రముఖ సినిమా హీరోయిన్ (మహానటి) కీర్తి సురేష్. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం

పొల్యూషన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నీ చెట్లను పెంచాలి అని కొరారూ.ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్ ; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈరోజు సూరారం లోని టెక్ మహేంద్ర క్యాంపస్ లో మొక్కలు నాటిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి గారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఆ సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు. వాతావరణ కాలుష్యాం నియంత్రణ కావాలి అంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు కాదంబరి కిరణ్ ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ,ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here