Home News

కేసీఆర్ పంజా విసురుతాడని ఈటలకు ముందే తెలుసా ?

ఈటల వ్యవహారం కొంతకాలంగా టీఆర్‌ఎస్‌లో భిన్నంగా ఉంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ జరిగింది. వేరే జెండా ఎగురేయాలన్న ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆరోపణలు వచ్చిన సమయంలో ఈటల ఎందుకు సీఎంను కలవలేదు.. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇలాంటిది ఒకటి జరుగుతుందని ముందే ఊహించారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చాయి. భూములను కబ్జా చేశారంటూ ఏకంగా గ్రామస్తులు, రైతులే ఫిర్యాదులు చేశారు. అయితే ఈ విషయంలో వార్తలు వచ్చినా..ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేయలేదు. తాను ఏ తప్పు చేయలేదంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి వదిలేశారు..అయితే ఆరోపణలు వచ్చినప్పుడు సీఎంను కలవాలి కదా.. కానీ ఎందుకు కలవలేదు.. ఈ ప్రశ్నలు హాట్‌ టాపిక్‌గా మారాయి. కేసీఆర్‌ను కలవాల్సిన అవసరం లేదని అనుకున్నారా..అయితే అప్పటికే వేరే జెండా ఎగురేయాలనే ఆలోచనతో ఉన్నారా అన్నదాని పై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఆరోపణలు రాగానే..ఈటల రాజేందర్‌ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇతరులపై విమర్శలు చేయకూడదు. నిజానికి కొత్త జెండాను ఎగురేయాలని అనుకున్నప్పుడు.. లేక మరో జెండా మోయాలని అనుకున్నప్పుడు అన్ని సక్రమంగా ఉండాలి.. క్లీన్‌ మ్యాన్‌గా ఉండాలి కానీ ఇక్కడ మాత్రం సీన్‌ పూర్తి భిన్నంగా ఉందన్నది అంతా చెబుతున్న మాట.

ఈటల రాజేందర్ వ్యవహారం గత కొద్ది కాలం నుంచి తిరుగుబాటు ధోరణిలో మాట్లాడుతున్నారు. గులాబీ పార్టీకి అందరూ ఓనర్లేనని కామెంట్‌ చేశారు. అంతేకాదు.. చాలా సందర్బాల్లో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ పార్టీ ఏనాడూ హెచ్చరించలేదు. అయితే ఇటీవల అది తారాస్థాయికి చేరింది. దీంతో ఈటలకు వేరే ఉద్దేశాలు ఉన్నాయా..ఈ పరిస్థితిని ముందే ఊహించారా..? అన్న అనుమానాలు తెరమీదికి వస్తున్నాయ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here