Home News Politics

మంత్రులకు అచ్చిరాని వైద్యారోగ్య శాఖ కేసీఆర్ మెడకు చుట్టుకోనుందా ?

తెలంగాణ మంత్రి వర్గంలో ఇప్పుడు వైద్యశాఖ అంటే నేత్లు హడలిపోతున్నారు. ఈశాఖ భాద్యతలు నిర్వహించిన ముగ్గురు నేతలు వివిధ సమస్యల్లో చిక్కుకోవడంతో ఉమ్మడి ఏపీలో దేవాదాయ శాఖలాగే ఇప్పుడు ఆరోగ్యశాఖ అంటే హడలిపోతున్నారు. తాజాగా భూ వ్యవహరంలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇప్పుడీశాఖ కేసీఆర్ దరి చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు ముగ్గురు నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌కు ఆ శాఖ అచ్చి రాలేదు. తాడికొండ రాజయ్య అవినీతి ఆరోపణలతో.ఈటల రాజేందర్‌ అసైన్డ్ భూముల కొనుగోళ్లు, భూకబ్జా వ్యవహారంలో మంత్రి పదవులు కోల్పోయారు.

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలను సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆయన నుంచి తప్పించి ముఖ్యమంత్రికి బదిలీ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రి వర్గం నుంచి తొలగించారు. తాత్కాలిక వైద్యులు, పారామెడికల్ పోస్టుల భర్తీ, 108కు వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి జరిగాయని తేలింది. కాళోజి ఆరోగ్య యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌ను నియమించారు. దీంతో రాజయ్యను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మాజీ లక్ష్మారెడ్డి కూడా…నకిలీ సర్టిఫికెట్ల వివాదంలోనే ఇరుక్కున్నారు. లక్ష్మారెడ్డి మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు డాక్టరంటూ ఎంపీ రేవంత్ రెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణ చేశారు. లక్ష్మారెడ్డి చదివింది హోమియోపతి డాక్టర్ కోర్స్. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో బీహెచ్ఎమ్ఎస్ కోర్స్ చేశానని ప్రస్తావించారు అంటు రేవంత్ నానా యాగీ చేశారు. 2018 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి విజయం సాధించినప్పటికీ…మంత్రి వర్గంలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.

ఇప్పుడి శాఖ కేసీఆర్ నిర్వహిస్తుండటంతో కేసీఆర్ కి పడవిగండం పొంచి ఉందా అన్న చర్చ మొదలైంది. ఎలాగు కేటీఆర్ ని సీఎం చేస్తున్నారన్న ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఇక కేసీఆర్ కూడ వైద్యశాఖ ఎఫెక్ట్ తో పదవి కోల్పోతారా అన్న చర్చ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here