హుజూరాబాద్ ఉప ఎన్నిక పై ఈటల ఎంత దూకూడుగా ఉన్నారో అంతకు మించిన దూకుడు సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. ఒక పథకం ప్రకారం ఈటల వ్యతిరేకులందరిని కేసీఆర్ ఏకం చేస్తున్నారని ఇప్పటికే ఫాం హౌస్ లో పెద్దిరెడ్డితో పలు దఫాలు చర్చలు జరిపారన్నారు. ఈటల ఆర్దిక వ్యవహారాల పై దూకుడుగా మాట్లాడే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని సైతం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఎల్ రమణకు టీఆర్ఎస్ ఆహ్వానం కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమే అన్నారు పాశం యాదగిరి. బీసీలో ఇతర వర్గాలను పద్మశాలీలను ఏకం చేసేందుకు ఎల్ రమణ ఉపయోగపడతారని కేసీఆర్ లెక్కలేస్తున్నారన్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన వదలని కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది.