Home News Updates

5100 రూట్లలో ప్రవేట్ బస్సులు! విలీనం ప్రశ్నే లేదు! కార్మికులకు డెడ్ లైన్ ఈ నెల 5: కేసీఆర్

తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. వివరాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే అంశమే లేదని తేల్చేశారు. 5100 రూట్లలో ప్రవేట్ బస్సుల్ని తిప్పనున్నట్లు చెప్పారు. నవంబర్ 5 లోపు కార్మికులు ఆర్టీసీలో చేరాలని డెడ్ లైన్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్ కింద చూడండి..

49అంశాల పై సుదీర్ఘమైన చర్చ జరిగింది.
* డీఏ పై ఆమోదం క్యాబినెట్ ఆమోదం.
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్

* ఆర్థిక మాన్యం ప్రభావం తెలంగాణకు కూడా ఉంది.
* ఆర్థిక మాన్యం వల్ల 16 శాతం తగ్గింది.

* రాష్ట్ర ప్రజల కోసం దీర్ఘకాలిక పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

5100 వంద ప్రైవేట్ రూట్లు, బస్సులకు క్యాబినెట్ ఆమోదం

ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని క్యాబినెట్ ఆమోదం
ఇప్పటికే 2100 బస్సులు ప్రైవేట్ ఐయిర్ లో ప్రస్తుతం నడుస్తున్నాయి.
సమ్మెకు వెళ్లవద్దని చెప్పినా కార్మికులు సమ్మెకు వెళ్లారు.

ఇల్లిగల్ సమ్మె అని లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినా కార్మికులు వినలేదు.
ప్రతిపక్షాల మాట పట్టుకొని సమ్మెలో కొనసాగుతున్నారు
బ్లాల్ మెయిల్ రాజకీయాలు నివారించబడాలి
దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీని నడిపిస్తున్నాయి
క్యాబినెట్ నిర్ణయం పై ఎలాంటి మార్పులు ఉండవు.

కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారమే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని జీతాలు ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నాము

టీఆరెస్ ప్రభుత్వం అందరికి న్యాయం చేసే విధంగా జీతాలు ఇస్తుంది..పెంచింది
49 వేల మంది కార్మికులు ఉన్నారు

కార్మికుల పొట్టకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు

ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడొద్దు

నవంబర్ 5వ తేదీలోగా కార్మికులు అందరూ డ్యూటీలో చేరేందుకు అవకాశం
వేట్ బస్సులు సైతం ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి

బస్సులు పాసులు అన్ని కొనసాగుతాయి
కార్మికుల ఉద్యోగాలకు రక్షణగా ఉంటుంది

ప్రైవేట్ రూట్లు ఇచ్చినా పాలసి నిర్ణయం మాత్రమే

పూర్తిగా ప్రైవేటీకరణ ఆర్టీసీని ప్రభుత్వం చేయడం లేదు
లాభాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయి

గ్రామాల్లో ప్రైవేట్ బస్సులు నడుస్తాయి

నష్టాల్లో నడిచే రూట్లలో ప్రైవేట్ కి ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి

ఆర్టీసీ తరహాలో 92 కార్పొరేషన్స్ ఉన్నాయి..వీళ్ళను చేస్తే వాళ్ళు డిమాండ్ చేస్తారు

5వ తేదీ నవంబర్ లోపు కార్మికులు రీ జాయిన్ కాకపోతే మిగతా రూట్లలో కూడా ప్రైవేటికరణ చేస్తాం
కేంద్రం చట్టానికి లోబడే ఆర్టీసీ ప్రైవేటికరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here