Home News Politics

నెల్లూరు జిల్లా ‘కావలి’లో కాక రేపుతున్న పాలిటిక్స్…!

నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2009 పునర్విభజనలో అల్లూరు నియోజకవర్గం కావలి గా మారింది.2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో దిగగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, పీఆర్పీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేయగా బీద విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల్లో రామిరెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి… సిట్టింగ్ ఎమ్మెల్యే కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో వైసీపీ నుంచి జారుకొనేందుకు మాజీ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు … తమకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తాడో చూస్తాం అని సవాళ్లు కూడా విసురుతున్నారు .. ఇదే అదునుగా ఆ అసంతృప్తి నేతలను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు టిడిపి స్కెచ్‌ గీస్తోంది… కావలి నియోజకవర్గంలో క్షణానికో రకంగా మారుతున్న రాజకీయ పరిణామాల పై తెలుగు పాపులర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్…

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైసీపీలో ఇంతకాలం అంతర్గతంగా ఉన్న లుకలుకలు కాస్తా ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి .. విభేదాలు తారాస్థాయికి చేరి మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి కూడా సిద్దమవుతున్నారు … 2014 ఎన్నికల్లో వైసీపీ లోని ముఖ్యనేతలంతా ఐకమత్యంగా పనిచేయడంతో ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు … అయితే ఈసారి మాత్రం పార్టీలోని ముఖ్య నేతలు రామిరెడ్డితో విబేధిస్తున్నారు.. అప్పటికే కావలి నియోజక వర్గం లో బలమైన నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ టికిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు… అయితే నాటి ఎన్నికల సమీకరణాల దృష్ట్యా ఆర్దికంగా బలవంతుడైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది….

వైసీపీ అధినేత సర్దిచెప్పడంతో టికెట్ దక్కకపోయినప్పటికీ విష్ణువర్దన్ రెడ్డి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు… ఆయనతో పాటు టిడిపి నుంచి వైసిపి లోకి వచ్చిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా పార్టీ కోసం పనిచేయడంతో వైసీపీ ఎమ్మెల్యే గా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి విజయం సునాయాసం అయింది… అలా అందరూ ఏకమై పక్కా ప్రణాళికతో పనిచేయడంతో .. టీడీపీలో ముఖ్య నేత, బిసి సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజధాని నిర్మాణ కమిటి సభ్యుడు బీదా మస్తాన్ రావు పై ప్రతాప్ రెడ్డి గెలుపొందారు…

ఇప్పుడు కావలి వైసీపీలో ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు… ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ నాలుగన్నరేళ్లు తమను కరివేపాకులా పక్కన పడేసారని … నియోజకవర్గంలో గానీ పార్టీలో గానీ తమకు ప్రాదాన్యతనివ్వలేదంటూ వైసిపి నేతలు విష్ణువర్దన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు… గత ఎన్నికల్లో జగన్ సర్దిచెప్పడంతో టికెట్ దక్కకపోయినా.. తాము పార్టీ విజయం కోసం పనిచేశామని..ఈ సారి మాత్రం తమకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందేనని ఇద్దరు అసంతృప్తి నేతలు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు… ఇద్దరిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా తమకు ఇబ్బంది లేదంటూ తమ ప్రయత్నాలు సాగించారు … ప్రతాప్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే ఓడించి తీరతామని ప్రకటించారు .. అదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెగేసి చెప్పారంట. విష్ణువర్దన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు పాదయాత్రను నిర్వహించి బలప్రదర్శనకు దిగారు .. ప్రతాప్ కే టికెట్ ఇస్తే ఓడించి తీరతామని పార్టీ పెద్దలకు సంకేతాలు పంపారు…

వైసిపిలోని ముఖ్య నేతల మధ్య మొదలైన విబేధాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టిడిపిలోని పెద్దలు ఆలోచిస్తున్నారు… అసంతృప్తి నేతలు విష్ణువర్దన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలకు గాలం వేయాలని వ్యూహరచన చేస్తున్నారట… తిరుగుబాటు నేతలను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వనిస్తున్నారు… ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారంట.. ఆ ప్రతిపాదనను ఈ ఇద్దరు నేతలు తిరస్కరించారంట .. ఎమ్మెల్యే టికెట్ కోసమే ఇంత పంచాయితీ నడుస్తుందని .. తమకు ఎమ్మెల్సీల హామీ వైసీపీలో కూడా ఉందని సమాధానమిచ్చారట. దీంతో కావలి టిడిపి ఎమ్మెల్యే టికెట్ విష్ణువర్దన్ రెడ్డికి ఇచ్చి.. వేణుగోపాల్ రెడ్డి కి ఎమ్మెల్సీ లేదా నామినేటెట్ పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట టిడిపి ముఖ్య నేతలు…

ఇప్పటికే కావలి టిడిపి ఇన్ చార్జి గా ఉన్న బీదమస్తాన్ రావును నెల్లూరు లోక్ సభ అభ్యర్దిగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే దాని పై లెక్కలు వేస్తున్నారట. ఒక వేళ బీద మస్తాన్ రావు లోక్ సభకు పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే.. ఆయన ఎప్పటి నుంచో కోరుతున్న రాజ్యసభ పదవిని ఆఫర్ చేస్తారేమో అన్న చర్చ కూడా నడుస్తోంది… మొత్తమ్మీద టిడీపీ పెద్దల స్కెచ్‌ వర్కౌట్‌ అయితే టీడీపీ పాత నేతలంతా ఒకగూటి కిందకి చేరినట్లు అవుతుంది.. బీద బ్రదర్స్, విష్ణువర్దన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు కలిస్తే పార్టీకి మంచి బూస్టప్‌ లభిస్తుందని తమ్ముళ్లు ఇప్పటి నుంచే ఆనందపడిపోతున్నారు … ఏది ఏమైనా అతి త్వరలోనే కావలి రాజకీయాలపై క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here