Home News Politics

కర్నూలుకు మంత్రి పదవులు ఇవ్వడం వెనుక బాబు వ్యూహమేంటి..!

కర్నూలు జిల్లాకి సీఎం చంద్రబాబు ఎందుకంత రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇ ఒక్క జిల్లా నుంచేముగ్గురికి మంత్రి పదవులు,8 మందికి నామినేటెడ్‌ పదవులు ఎందుకింత ప్రాధన్యాత….గత ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో అత్యధిక సీట్లు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే వ్యూహాలు అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు 2014 జూన్‌లో సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. . నామినేటెడ్‌, మంత్రి పదవుల కేటాయింపులో జిల్లాకు పెద్దపీట వేశారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలే టార్గెట్ గా చంద్రబాబు ఆపరేషన్ కర్నూల్ మొదలుపెట్టారు….


డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పటికే కేబినెట్‌లో ఉండగా టీజీ వెంకటేశ్‌ను రాజ్యసభకు పంపారు. ఎనిమిది మందికి కార్పొరేషన్‌, ఫెడరేషన్‌, అకాడమీ చైర్మన్‌ పదవులను ఇచ్చారు. తాజాగా ముస్లిం వర్గానికి చెందిన ఎన్‌ఎండీ ఫరూక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కీలకమైన మైనార్టీ సంక్షేమం, వైద్య విద్యశాఖలు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు కీలక పదవులు ఇస్తున్నారు. జిల్లాలో ముగ్గురికి మంంత్రి పదవులు, మరో పది మందికి నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా ఒకనాడు టీడీపీకి కంచుకోట. 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ బలపడింది. 2014 ఎన్నికల్లో అధికార టీడీపీ కేవలం మూడు స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

2014 ఎన్నికల్లో పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మిగనూరు, బనగానపల్లె నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్దన్‌ రెడ్డి మాత్రమే గెలిచారు. మిగిలిన 11 చోట్ల ఓడిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగిం చారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజకీయంగా జిల్లాలో బలంగా ఉన్న రెడ్డి సామా జికవర్గానికి చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. పర్యాటక శాఖను అప్పగిం చారు. నంద్యాల, ఆదోని, కర్నూలు, ఆత్మకూరు, బనగానపల్లె నియోజక వర్గాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఆ సామాజికవర్గానికి దగ్గర అయ్యేందుకు నంద్యాలకు చెందిన సీనియర్‌ నాయకుడు ఎన్‌ఎండీ ఫరూక్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఆ తరువాత శాసన మండలి చైర్మన్‌ను చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఫరూక్‌కు కేబినెట్‌లో స్థానం కల్పించారు. వైద్య విద్య, మైనార్టీ సంక్షేమం, ఎన్టీఆర్‌ వైద్యసేవ, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, ఎపీఎంఎస్‌ఐడీసీ, ఫుడ్‌సేఫ్టీ శాఖలు అప్పగించారు. మంత్రివర్గంలో జిల్లాకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

జిల్లా నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో ఐదుగురు వైసీపీ నుంచి పార్టీలో చేరారు. సంఖ్యాపరంగా బలం పెరిగినా.. రాజకీయంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు. ఆ దిశగా నాలుగున్నరేళ్లుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. జిల్లాలో బలంగా ఉన్నా బీసీ, మైనార్టీ, వ్యాపారవర్గాలకు చేరువయ్యేలా నామినేటెడ్‌ పదవులు కేటాయించారు. సీఎం చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా..? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో పాగా వేస్తుందా..? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.

ప్రభుత్వ నామినే టెడ్‌ పదవుల పంపిణీలోనూ అన్ని వర్గాలను ఆకట్టుకు నేలా వ్యవహరించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చేరువయ్యేం దుకు మాజీ మంత్రి టీజీ వెంక టేశ్‌ను రాజ్యసభకు పంపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కుడా చైర్మన్‌ పదవి ఇచ్చారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, నంద్యాలకు చెందిన ఏవీ సుబ్బారెడ్డికి ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నౌమాన్‌కు ఉర్దూ అకాడమీ చైర్మన్‌, ఆత్మకూరుకు చెందిన మోమిన్‌ అహ్మద్‌ హుసేన్‌ను రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ను చేశారు. పశ్చిమ నియోజకవర్గాల్లో వాల్మీకి బోయ సామాజిక వర్గం బలంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here