కర్ణాటకలో నాయకత్వ మార్పు పై బీజేపీ దృష్టి పెట్టిందా..రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పరిపాలనలో సీఎం తనయుడి జోక్యం ఎక్కువైందని సొంత పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలే యడ్డీని టార్గెట్ చేయడంతో కర్ణాటక రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.

సొంత పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేల మాటలు ఇప్పుడు యడియూరప్ప సర్కార్ ని పీకల్లోతు కష్టాల్లో నెడుతున్నాయి.
సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని సొంత పార్టీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇది మూడు ముక్కల ప్రభుత్వమని మంత్రి యోగీశ్వర్ విమర్షలు కూడా పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చకు దారి తీశాయి. మా ప్రభుత్వం కాంగ్రెస్, జేడీఎస్లతో కుమ్మక్కయ్యింది అని విమర్శించారు. ఆయన ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ తో భేటీ అయి తాజా రాజకీయపరిణామాల పై చర్చించారు. మరోపక్క సీఎం యడ్డి తనయుడు విజయేంద్రతో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అరుణ్సింగ్ను కలిసినట్లు తెలుస్తుంది.