Home News

కర్ణాటక పొలిటికల్ హైడ్రామాలో కీలక మలుపు…!

కర్ణాటకలో రాజకీయ హైడ్రామా కీలక మలుపు తీసుకుంది.ఈ రోజు ఎట్టి పరిస్థితిల్లోనూ బలపరీక్ష జరపాలని ప్రయత్నించిన కమల దళంకి నిరాశే మిగిలింది. విశ్వాస పరీక్షను స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ రేపటికి వాయిదా వేశారు. స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలపరీక్షను ఈరోజే నిర్వహించాలని గవర్నర్‌ సందేశాన్ని కూడ స్పీకర్ ఖతారు చేయకపోవడం పై ఆందోళనకి దిగింది…దీంతో ఓటింగ్ జరగకుండానే సభ రేపటికి వాయిదా పడింది…

అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని ఆ పార్టీ నేత యడ్యూరప్ప సభలోనే బైఠాయించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అంతకుముందు బలపరీక్షను ఈరోజే పూర్తిచేయాలని కర్ణాటక స్పీకర్‌కు రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా సూచించారు. గవర్నర్‌ సందేశం స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభలో చదివి వినిపించారు.

విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కాలయాపన చేస్తున్నాయని బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు హాజరు కాకపోయినా ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తప్పవని సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నంగా తమ పార్టీ రెబెల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేస్తూ హెచ్చరించారు. మరో పక్క బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుతో డీకేశివకుమార్ చర్చలు జరపడం…సీఎం పదవి కూడ ఆఫర్ చేశారన్న వార్త బయటకి రావడంతో కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

మరోవైపు విప్‌ విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చేంత వరకూ విశ్వాస పరీక్ష చేపట్టవద్దని సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ గందరగోళం మధ్యనే సభ రేపటికి వాయిదాపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here