Home Entertainment Cinema

విజయ్ దేవరకొండను మరోసారి నమ్ముతున్న బాలీవుడ్ నిర్మాత..

ఒకసారి నమ్మి మోసపోయిన తర్వాత మరోసారి నమ్మడం అంటే అంతకంటే రిస్క్ మరొకటి ఉండదు. కానీ ఇప్పుడు ఒక బాలీవుడ్ నిర్మాత ఇదే చేయబోతున్నాడు. ఇప్పటికే ఒకసారి విజయ్ దేవరకొండను నమ్మి దారుణంగా మోసపోయాడు ఆయన. సినిమా ఎలా ఉంటుందో చూడకుండా విడుదలకు ముందే రీమేక్ రైట్స్ తీసుకుని ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలో తెలియక తిక్క చూపులు చూస్తున్నాడు. అతనే కరణ్ జోహార్.. ఆయన తీసుకున్న సినిమా డియర్ కామ్రేడ్. అప్పట్లో ఈ సినిమాపై ఉన్న హైప్ చూసి సినిమా ఎలా ఉందో తెలుసుకోకుండా రీమేక్ రైట్స్ తీసుకున్నాడు ఈ నిర్మాత. హిందీలో సినిమా రీమేక్ చేస్తానని కూడా అనౌన్స్ చేశాడు. కానీ తెలుగులో విడుదలైన తర్వాత డిజాస్టర్ కావడంతో ఇప్పుడు డియర్ కామ్రేడ్ రీమేక్ రైట్స్ ఏం చేసుకోవాలో తెలియక అలాగే తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో మరోసారి విజయ్ దేవరకొండను నమ్ముతున్నాడు కరణ్ జోహార్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Vijay Devarakonda in World Famous Lover

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో తెలుగులో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకనిర్మాత పూరి జగన్నాథ్. ఈయనకు హిందీలో కూడా బాగానే క్రేజ్ ఉండటంతో ఫైటర్ సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనికోసమే బాలీవుడ్ లో కరణ్ జోహార్ తో టై అప్ అయ్యాడు ఈయన. హిందీలో ఫైటర్ సినిమాను ఆయన విడుదల చేయబోతున్నాడు. అప్పట్లో బాహుబలి సినిమాను కరణ్ జోహార్ హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల వైపు పెద్దగా చూడలేదు.

ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ సినిమాను విడుదల చేయబోతున్నాడు ఈయన. ఇదే ఏడాది ఫైటర్ విడుదల కానుంది. మొత్తానికి ఒకసారి విజయ్ దేవరకొండను నమ్మి సినిమా ఎలా ఉంటుందో తీసుకోకుండా దారుణంగా మోసపోయాడు కరణ్ జోహార్. మరి ఇప్పుడు పూరి జగన్నాథ్ ను నమ్మి ఏం చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here