Home Entertainment Cinema

కంగన రనౌత్ కి షాకిచ్చిన ట్విట్టర్..పర్మినెంట్ బ్యాన్

బాలీవుడ్ నటి కంగన రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది ట్విటర్. ఆమె వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. హింసకు దారి తీసే అవకాశం ఉన్నందను అకౌంట్‌ సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తుండటంతో కంగన రనౌత్ ట్విటర్ అకౌంట్‌ను తొలగించినట్లు వివరణ ఇచ్చింది. ట్విట్టర్‌ రూల్స్‌ ఈ అకౌంట్ ఉల్లంఘిస్తోందని తెలిపింది. తమ వేదికపై ట్విటర్ రూల్స్‌ను అందరికీ నిష్పాక్షికంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ట్విట్టర్‌ ప్రతినిధులు.

బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండపై జర్నలిస్ట్ స్వపన్ దాస్‌గుప్తా చేసిన ట్వీట్‌కు కంగన రనౌత్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ 2000వ సంవత్సరం ప్రారంభంలో ప్రదర్శించిన విరాట్ స్వరూపంతో మమత బెనర్జీని లొంగదీయాలని కంగన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీటే ఆమె ట్విటర్ అకౌంట్‌ను పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడానికి దారి తీసి ఉండవచ్చునని తెలుస్తోంది. కంగన ట్వీట్‌పై తీవ్ర దుమారం రేగింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. తన అకౌంట్‌ను పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడంపై కంగన ఇంకా స్పందించలేదు. బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో స్పందించారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here