Home Entertainment Cinema

ట్విటర్‌ పై కంగనా సంచలన వ్యాఖ్యలు..తెల్ల తోలు అంటూ..

ట్విటర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెల్లతోలు ఉన్నవారు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారు అంటూ ట్విటర్ యాజమాన్యంపై మాటల దాడి చేశారు. సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు.

గోధుమ రంగు శరీరం ఉన్నవారిని తెల్లతోలు ఉన్నవారు బానిసలుగా చూస్తారన్నారు కంగనా రనౌత్‌. ట్విటర్ అదే నిరూపించిందని తెలిపారు. ఎందుకంటే ట్విటర్ యాజమాన్యం అమెరికాకు చెందిందని గుర్తు చేశారు. మనమేం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో వాళ్లే నిర్ణయించాలనుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ పోతేనేమి..? నాకు వేరే సామాజిక మాధ్యమాలు ఉన్నాయని ధీమావ్యక్తంచేశారు. అందులో నా గొంతును వినిపిస్తానని తెలిపారు.

నేను నటినని అన్న కంగనా ..సినిమాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాను అన్నారు. ఈ దేశంలో కూడా కొంత మంది ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. వారు వేధింపులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారిని బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ వారికి విముక్తి దొరకలేదన్నారు. వారికోసం మాట్లాడతానన్నారు కంగనా రనౌత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here