Home News Politics

కమలంలో సీట్ల పై అడ్డుపడుతున్న నేత ఎవరు…?

కమలం పార్టీలో ఒక వైపు ప్రకటించిన సీట్ల పై రభస నడుస్తుంటే … మరొకవైపు ప్రకటించని సీట్లపై లొల్లి మొదలయింది… పక్క పార్టీ ల నుంచి పేరున్న నేతలు వస్తారనే ఆశతో కొన్ని సీట్లను అభ్యర్థులనుప్రకటించకుండా ఆపారు బిజెపి పెద్దలు … మరోవైపు మరి కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించకుండా పార్టీలోని ఒక పెద్దమనిషి అడ్డుకుంటున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది…


ముందస్తు ఎన్నికల్లో ఒంటరిపోరు చేస్తున్న భారతీయ జనతా పార్టీ .. అభ్యర్ధుల ప్రకటన విజయంలో అధికారపక్షం టిఆర్‌ఎస్‌ తర్వాత స్థానంలో ఉంది.. ఇప్పటి వరకు రెండు విడతల్లో 66 నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది… మొదటి జాబితా లో 38 మంది ని ప్రకటిస్తే రెండో జాబితాలో మరో 28 నియోజక వర్గాలకు క్యాండెట్లను ప్రకటించింది… అయితే మిగతా నియోజక వర్గాల సంగతి ఎంటనే చర్చ జరుగుతోంది…

ఇంకా ప్రకటించకుండా ఆపిన స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ లో సమర్థులైన నేతలు ఉన్నారు … వాళ్ళు పోటీ చేసేందుకు సిద్దమే అంటున్నారు .. అయినా క్యాండెట్ల ఫైనల్‌ లిస్ట్‌ ఎందుకు ఆపుతున్నారనే ప్రశ్న పార్టీ శ్రేణులో వినిపిస్తోంది… మూడో జాబితాకు సంబంధించి … అంత సిద్ధం అయ్యాక చివరి క్షణాల్లో ప్రకటన ఆపేశారు.. ఆ లిస్ట్‌  ప్రకటించకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది…

ప్రధానంగా పార్టీ రాష్ట్ర పెద్దలు ఇంకా పక్క పార్టీ ల అసంతృప్తుల పై ఆశతో ఉండటం అంటున్నారు … మహా కూటమి సీట్ల సర్దుబాటు తర్వాత తమ పార్టీలోకి ఆయా పార్టీల్లోని ఆశావహులు వస్తారనే విశ్వాసంతో కొన్ని సీట్లను అపుతున్నారట.. తెలంగాణ ఉద్యమం లో పనిచేసి సొంత పనులు చూసుకుంటున్న నేతలపై కూడా బీజేపీ పెద్దలు ఇంకా భరోసా పెట్టుకున్నారట… వారి కోసం మరికొన్ని సీట్లు అపారని పార్టీ నేతలు అంటున్నారు…ఇంకొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించకుండా పార్టీ లోని ఓ ముఖ్య నేత అడ్డుకుంటున్నారట…  సామాజిక సమీకరణాల లెక్కలతో సమర్ధుల కోసం ఇంకొన్ని చోట్ల అభ్యర్ధులను ప్రకటించకుండా ఆపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అభ్యర్ధిత్వాలు ప్రకటిస్తే ప్రచారం మొదలు పెట్టుకుంటామని ఆయా నియోజక వర్గాల నుండి నేతలు ఒత్తిడి చేస్తున్నా పార్టీ ముఖ్యులు పట్టించుకోవడం లేదు… మరి వారి లెక్కల ప్రకారం కొత్తగా వచ్చే వారు ఏ మేరకు ప్రభావం చూపుతారో తెలియదు కాని … ఆశలు పెట్టుకున్న నేతలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి…. ఇలా తేల్చకుండా నాన్చడం ఏంటని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే … కొందరు నేతలయితే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…

మొదటి లిస్ట్ లో తన పేరు లేనందుకు అలిగిన భువనగిరి నేత శ్యామ్ సుందర్ .. ఇప్పుడు తనకు టికెట్ ఇచ్చినా పోటీ చేయను అంటున్నారు … ఇతర పార్టీల నుంచి ఎవరో వస్తారని తనకు  ఇవ్వకుండా ఉండడం .. తనను అవమానించినట్టే నని ఆయన పార్టీ నేతల ముందు గట్టిగానే చెప్పార ట… అయితే పార్టీ లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని…అసంతృప్తులు టచ్ లో ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు.. 119 సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని ….సామాజిక సమతుల్యంతో అభ్యర్థులను బరిలో దించుతామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్‌ అంటున్నారు ..

భువనగిరి, జనగామ, మహబూబ్‌నగర్, చెన్నూర్, పరిగి, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి, కొత్తగూడెం, మహేశ్వరం,  సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజక వర్గాలను వలస నేతల కోసమే ఆపారని బిజెపి శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి .. అలాగే మహాకూటమి లో సీట్ల సర్దుబాటు తర్వాత తాము ఆశించిన స్థానాలు దక్కకుంటే .. బిజెపిలోకి వస్తామని చెప్పారంట కూటమిలోని కొందరు నేతలు … అందుకే అటువంటివారు  ఆశిస్తున్న స్థానాలను కావాలనే ఆపారని బీజేపీ లో చర్చ జరుగుతోంది… ఇక మహేశ్వరం నుంచి బీసీని బరిలోకి దించాలని చూస్తున్నారు కమలనాథులు .. భువనగిరి, మహబూబ్‌నగర్ , పరిగి, జనగామ లాంటి ప్లేస్ లను బయట వారి కోసం బీజేపీ లోని ఒక సీనియర్ నేత ఆపినట్టు తెలుస్తోంది… మొత్తమ్మీద ప్రకటించిన సీట్లలో ఇప్పటికే మూడో వంతు సీట్లను బయట నుండి వచ్చిన వారికి ఇచ్చింది బిజెపి .. మిగిలిన సీట్ల విషయం లోను అదే ట్రెండ్ కొనసాగించే పనిలో పడినట్లు కనిపిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here