Home Entertainment Cinema

క‌మ‌ల్ హాస‌న్ నామ ర‌హ‌స్య‌మేంటి?

క‌మ‌ల్ హాస‌న్ నామ ర‌హ‌స్య‌మేంటి?

క‌మ‌ల్ హాస‌న్ హిందువా? ముస్లిమా? ఇప్పుడిదో హాట్ టాపిక్. అదేంటి క‌మ‌ల్ త‌మిళ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడు క‌దా? మ‌రి ఈ డౌటేంటి? త‌ండ్రి పేరు శ్రీనివాస అయ్య‌ర్. లాయ‌ర్. మ‌రి పేరులో ఈ హాస‌న్ అన్న ముస్లిం శ‌బ్ధం ఎక్క‌డిది? మాములుగా ఇలాంటి పేర్లు పెట్టుకునేది ముస్లిములు. కానీ క‌మ‌ల్ హాస‌న్, చారు హాస‌న్, సుహాసినీ ఈ పేర్ల‌లోని ముస్లిం శ‌బ్ధ‌మేంటి? అన్న‌ది అంద‌రినీ తొల‌చి వేస్తున్న ప్ర‌శ్న‌.

దీనంత‌టికీ కార‌ణం క‌మ‌ల్ హాస‌న్ కి మ‌న హిందూ సంస్కృతీ సంప్ర‌దాయాలంటే ఉన్న అయిష్ట‌త‌. తాను వీట‌న్నిటికీ దూర‌మ‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించే శైలి వెర‌సీ క‌మ‌ల్ హాస‌న్ ని హిందువా? ఇస్లాంకి చెందిన వాడా? అన్న అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. ఒక ప‌క్క పేరు.. మ‌రొక ప‌క్క అత‌డి తీరు క‌లిపి చూస్తే హిందువులంటే క‌మ‌ల్ కి తొలినాటి నుంచీ బేధాభిప్రాయం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

మ‌హాభార‌తం మీద క‌మ‌ల్ చేసిన కామెంట్ల‌ను చూసిన వాళ్ల‌కు ఇత‌డు హిందువు కాడు ముస్లిం అన్న అనుమానానికి మ‌రింత బ‌లం చేకూరింది. దీంతో క‌మ‌ల్ హిందూ ఆర్ ముస్లిం అన్న డిబేట్ కి తెర‌లేచింది. ఇంత చేస్తే క‌మ‌ల్ హాస‌న్ పేరులో హాస‌న్ దేన్ని సూచిస్తుంది? అంటే ఇందుకో చిన్న క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. ఇది స్వ‌యానా క‌మ‌ల్ హాస‌నే చెప్పుకున్న నామ ర‌హ‌స్యం..

క‌మ‌ల్ హాస‌న్ తండ్రికి స్వాతంత్ర్య స‌మ‌ర కాలంలో హాస‌న్ అనే స్నేహితుడండేవాడ‌నీ.. ఈ మిత్రుడి అకాల మ‌ర‌ణం క‌మ‌ల్ తండ్రి జీర్ణించుకోలేక‌పోయాడ‌నీ దీంతో అత‌డి పేరు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా త‌న పిల్ల‌ల‌కు పెట్టుకున్నార‌నీ.. అందుకే స‌గం హిందూ స‌గం ముస్లిం శ‌బ్ధం వ‌చ్చేలా క‌మ‌ల్ హాస‌న్ కుటుంబంలోని పేర్లు ఉంటాయ‌నీ అంటారు.

పేరులోని ఈ శ‌బ్ధాన్ని క‌మ‌ల్ ఒంట‌బ‌ట్టించుకున్నారేమో తెలీదు.. హిందూ క‌న్నా ముస్లింగానే ఎక్కువ‌గా మాట్లాడుతుంటార‌న్న విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. క‌మ‌ల్ తొలినాటి నుంచీ నాస్తిక వాది. ఇందుకు కుల‌మ‌తాల‌కు సంబంధ‌మే లేదు. మాములుగా సినిమా ఫీల్డ్ అంటే విప‌రీత‌మైన సెంటిమెంట్లు ఉండే చోటు. అలాంటి చోటు ఇలాంటి నాస్తికులుండ‌టం అరుదైన విష‌య‌మే. అద‌న్న‌మాట సంగ‌తి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here