Home News

తమిళ రాజకీయల్లో ఫ్లాప్ స్టార్స్ గా మారిన కమల్ హాసన్,కుష్బు

సినిమాలు.. రాజకీయాలు ఒకేలా కనిపిస్తాయ్‌కానీ ఈ రెండింటికి మధ్య సన్నటి గీత ఉంటుంది..అది గుర్తించకపోతే రాజకీయాల్లో బొక్కాబోర్లా పడటం ఖాయం. తమిళనాడులో ఎందరో సినీ నటులు రాజకీయంగా అదరగొట్టారు సీఎం పగ్గాలు చేపట్టారు..అలాగే కొందరు పొలిటికల్‌గా చేతులు కూడా కాల్చుకున్నారు. ఇప్పుడు వెండితెర విశ్వరూపం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు. కమల్‌ హాసన్‌ కూడా లిస్ట్‌లో చేరిపోయారు.

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తెరమీది నటనకు ఎవ్వరూ సాటిరారు..! ఆయన చేసిన సినిమాలు.. క్రేజ్‌ మరో లెవల్‌ ఉంటాయ్‌. అయితే ఇదే అదునుగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్‌ వస్తారా..? రారా..? అనుకుంటున్న సమయంలో కమల్‌ తన పొలిటికల్‌ ఎంట్రీని ప్రకటించేశారు. 2018లో పార్టీ పెట్టేసి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని బరిలోకి దించారు. అయితే ఇక్కడ ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీకి పెద్దగా ఓట్లు రాలేదు. కేవలం 3.72 శాతంతో సరిపెట్టుకుంది.

అయితే భారీ ఆశలతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాడు కమల్‌ హాసన్‌. ఈసారి ఆయన సొంతంగా పోటీ చేశారు. కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి బరిలోకి దిగారు. తన పార్టీ అభ్యర్థులను 142 స్థానాల్లో పోటీకి దింపాడు. అటు కూటమి పెట్టి.. తమిళ రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్రయత్నించారు. కానీ కమల్‌ హాసన్‌కి నిరాశ తప్పలేదు. ఆయన పార్టీ ఫేట్‌ మారలేదు. 142 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అటు కూటమి పార్టీలు కూడా ఒక్క స్థానం గెలుచుకోలేకపోయాయి.

కోయంబత్తూర్‌ సౌత్‌లో కొద్ది సేపు లీడ్‌లో కనిపించిన కమల్‌.. గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ చివర్లో సీన్ మారిపోయింది. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌పై 900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంతేకాదు.. ఆయన పార్టీ ఓట్‌ బ్యాంక్‌ మరింత దిగజారింది. కమల్‌ పార్టీకి కేవలం అర్బన్‌ ఏరియాలో మాత్రమే కాస్త ఓట్లు పడ్డాయి. చెన్నైలో పోటీకి దిగిన నాలుగు స్థానాల్లో మూడు సీట్లలో లక్షకు పై ఓట్లు వచ్చాయి. అయితే రజనీకాంత్‌ పార్టీ పెట్టకుండా సేఫ్‌గా ఉన్నాడని.. కానీ కమల్‌ పార్టీ పెట్టి పరాజయం పాలయ్యారని సెటైర్లు పడుతున్నాయ్‌.

ఇక డీఎమ్‌కే టు కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ టు బీజేపీకి మారిన నటి కుష్బూకి కూడా నిరాశ తప్పలేదు. అసెంబ్లీ టిక్కెట్‌ దక్కిందని ఆనందించేలోపే ఆమెను పరాజయం పలకరించింది. థౌజండ్‌ లైట్స్‌ స్థానంలో డీఎమ్‌కే అభ్యర్థి చేతిలో ఓడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here