Home Entertainment Cinema

సెన్సార్ బోర్డుపై కాజల్ అగర్వాల్ అసహనం.. నా సీన్స్ కత్తిరిస్తారా..?

కాజల్ ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలు అయితే చేస్తుంది. అందులో స్టార్ హీరోలున్నారా లేదా అనేది ఇప్పుడు చూడటం లేదు ఈ ముద్దుగుమ్మ. అవసరం అనుకుంటే కొత్త హీరోలతో కూడా నటించడానికి రెడీ అంటుంది. తనకు కావాల్సింది పారితోషికం.. అది సరిగ్గా ఇస్తే హీరో ఎవరైనా ఓకే అనేస్తుంది ఈ భామ. అందుకే కొన్నేళ్లుగా కాజల్ నుంచి వరస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే ఆమె నటించిన ఓ సినిమా కొన్ని నెలలుగా రిలీజ్ కు నోచుకోకుండా ఉంది. అదే ప్యారిస్ ప్యారిస్. క్వీన్ సినిమాకు రీమేక్ గా రమేష్ అరవింద్ తెరకెక్కించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని కూడా చాలా నెలలు అయిపోయింది.

Kajal Agarwal

అప్పట్లో ప్రమోషన్స్ కూడా చేయాలనుకున్నారు. తీరా సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లిన తర్వాత అసలు షాక్ తగిలింది. ఒకటి రెండు కాదు.. ఈ చిత్రానికి ఏకంగా 25 కట్లు ఇవ్వడంతో సినిమా నిడివి పూర్తిగా తగ్గిపోయింది. దాంతో దర్శక నిర్మాతలకు కూడా కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తిక్కచూపులు చూస్తున్నారు మేకర్స్. పైగా టీజర్ లో కాజల్ స్థనాల్ని నొక్కే సీన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి హాట్ సీన్స్ సినిమాలో ఇంకా ఉండటంతో కత్తెరకు పని చెప్పింది సెన్సార్ బోర్డ్.

అవన్నీ తొలగిస్తే తప్ప సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమంటున్నారు సెన్సార్ బోర్డు. అయితే హిందీలో ఎలా ఉంటే ఇక్కడ తాము అలాగే చేసామని.. అక్కడ సెన్సార్ వదిలేసినపుడు ఇక్కడెందుకు వదిలేయదు.. అనవసరంగా తాము కష్టపడి చేసిన సీన్స్ ను కూడా కత్తిరించేసారంటూ అసహనం వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. మరి ఈ చిత్రం ఎప్పుడు వస్తుందంటే తనకు తెలియదంటూ సింపుల్ గా సమాధానమిచ్చేసింది ఈ చందమామ. మొత్తానికి సెన్సార్ బోర్డ్ చేసిన పనితో కాజల్ మాత్రం నిజంగానే చాలా డిస్టర్బ్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here