Home Entertainment

బ్రేకింగ్: జూ.ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్

టాలీవుడ్ లో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపింది. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం హో క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని ఎన్టీఆర్ కోరారు. త‌న ఆరోగ్యం గురించి టెన్షన్ వద్దని అభిమానులకు సూచించిన ఎన్టీఆర్.. తొందరలోనే కరోనా నుంచి కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కరోనా,వ్యాక్సినేషన్ పై ఆ టీంతో కలిసి ఓ వీడియో రూపోందించారు. ప్రస్తుతం కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నానని తెలిపిన ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు గురవ్వద్దు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here