ఎన్టీఆర్ బర్డ్ డే గిఫ్ట్ గా RRR మువీ టీమ్ కొమురం భీం గెటప్ లో కొత్త లుక్ విడుదల చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి భారీ అంచనాల మధ్య రూపోందితున్న RRR మూవీ షూటింగ్ సమయం నుంచి ఏదో సెన్సేషన్ క్రియోట్ చేస్తూనే ఉంది. తాజాగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న తారక్ కు ఆయన అభిమానులకు RRR నుంచి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఇన్టెన్స్లుక్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
గతంలో రాంచరణ్ భర్త్ డే సందర్భంగా అల్లురిగా రాంచరణ్ పోస్టర్ రిలీజ్ చేసిన రాజమౌళి ఈసారి ఎన్టీఆర్ మరో షేడ్ లో ఉన్న కొమురం భీం గెటప్ ని రిలీజ్ చేశారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.