ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోనుందా? .. వైసిపి వ్యూహాత్మకంగా టిడిపికి షాక్ ఇవ్వడానికి పావులు కదుపుతోందా?… అధికారపక్షం ఎవరి కోసం తెరవెనుక మంత్రాంగం సాగిస్తోంది? .. ఆ స్కెచ్ వర్కౌట్ అయితే చోటుచేసుకోబోయే పరిణామాలేంటి? .. అసలు సదరు సెలబ్రిటీ వైసిపి ప్రతిపాదనకు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారా?

నందమూరి తారక రామారావు .. నందమూరి ఫ్యామిలీలో ఇండస్ట్రీపరంగా ప్రస్తుతం ఫుల్‌ఫాంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ … అటు సినిమాల్లోనూ ఇటు పాలిటిక్స్‌లోనూ ఎప్పుడూ సంచలనమే.. తెలుగు వారిలో అతనంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతమందో.. తాత స్థాపించిన పార్టీ అని టిడిపి గురించి గర్వంగా చెప్పుకునే ఎన్టీఆర్ పదేళ్ల నుంచి పాలిటిక్స్‌కి దూరంగా ఉంటున్నారు .. 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జూనియర్ తర్వాత పొలిటికల్ స్ర్కీన్‌పై కనిపించలేదు.. వారసత్వపు పోరుతోనే ఆయన పార్టీకి దూరంగా జరిగారన్న ప్రచారం ఉంది.. అలాగని అతను ఇంతవరకు వేరే పార్టీవైపు చూసిన దాఖలాలు కనిపించవు..
రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాలకే తన తొలి ప్రాధాన్యత అంటుంటారు ఎన్టీఆర్.. అయితే అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయనా.. ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకుంటారన్న ప్రచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది .. ఏపి ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ను నియమిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…

ఆ మేరకు వైసిపిలో ఇంటర్నల్‌గా చర్చ జరిగిందంట.. అంతేకాదు ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉండే మంత్రి కొడాలి నానికి అతన్ని ఒప్పించే బాధ్యత అప్పగిస్తారంటున్నారు.. ఒకవేళ సీఎం వైఎస్ జగన్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను నియమించాలని నిర్ణయించి.. అందుకు అతను ఒప్పుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది పెద్ద సంచలనమే..