Home Entertainment

క‌రోనాతో క‌న్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ టీఎన్ఆర్

కరోనా మరో సీనియర్ జర్నలిస్ట్ ని బలితీసుకుంది. ఇటీవలే జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం కరోనా బారినపడి మృతి చెందగా తాజాగా యూట్యూబ్ ఇంటర్యూలతో ఫేమస్ అయిన జర్నలిస్ట్జ‌ర్న‌లిస్ట్ టీఆన్ఆర్ కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. క‌రోనాతో కొద్ది రోజులుగా మాల్కజ్ గిరిలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా విష‌మించ‌డంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. టీఎన్ ఆర్ పూర్తి పేరు తుమ్మ‌ల న‌ర్సింహారెడ్డి.

టీఎన్ఆర్ గా యూట్యూబ్ ఇంటర్యూల ద్వారా గుర్తింపు పొందిన టీఎన్ఆర్ ఇపుడిప్పుడే పలు సినిమాల్లో కేరక్టర్ అర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. పలు మీడియా సంస్థల్లోను టీఎన్ఆర్ పనిచేశారు. టీఎన్ఆర్ ఇలా అకాల మ‌ర‌ణం చెంద‌డంతో పలువురు మ్రముఖులు ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here