Home News

యూపీలో కాంగ్రెస్ కి బిగ్ షాకిచ్చిన బీజేపీ

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కి గట్టి షాక్‌ తగిలింది.
యూపీ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జితిన్‌ ప్రసాద్‌ కమలం గూటికి చేరారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు జితిన్‌ ప్రసాద్‌ రాక బీజేపీకి బలం చేకూర్చినట్లైంది. యూపీలో కాంగ్రెస్‌కి బ్రాహ్మణ ఫేస్‌గా ఉన్న జితిన్‌ ప్రసాద్‌.. రాహుల్‌ కోర్‌ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పిన వారిలో ఆయన కూడా ఒకరు.

జితిన్‌ ప్రసాద్‌ తండ్రి జితేంద్ర ప్రసాద్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. తండ్రి వారసత్వంతో 2001లో రాజకీయాల్లోకి వచ్చిన జితిన్‌ ప్రసాద్‌.. 2004లో షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. 2009లో దౌరారా నుంచి మరోసారి విజయం సాధించారు. 2014లో మాత్రం బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. జితిన్‌ రాకతో బ్రహ్మణ ఓటర్లలో బీజేపీ ఆధిపత్యం మరింత పెరుగుతుందని కమలం నేతలు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here