Home News Politics

జిల్లా పార్టీకి ఆ నేతే ప్లస్సు, మైనస్….

మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయాల్లో కొనసాగతున్న నాయకుడాయన . ఆనాటి నేదురుమల్లి వంటి సీనియర్లతో పాటు మొన్నటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా వ్యవరించిన ఉద్ధండుడు . కాలం కలిసిరాకపోవడంతో వేరే పార్టీలో చేరి కీలక నాయకుడిగా వ్యవహిరిస్తున్నారట . అధినేతకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆ నాయకుడే ఇప్పుడు పార్టీకి ప్లస్ & మైనస్ గా మారారు .

శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ గా రాజకీయాల్లోకి ప్రవేశించి పలువురు ముఖ్యమంత్రుల హయాంలో రాష్ట్ర క్యాబినెట్ లో చోటుదక్కించుకుని మంత్రిగా పనిచేసిన అపార అనుభవమున్న నాయకులు ధర్మాన ప్రసాదరావు . కానీ ఇదంతా నాణానికి ఒక వైపేనని జిల్లాలో తాజాగా చర్చ నడుస్తోందట . గ్రామీణస్థాయిలో సమస్యలకు పరిష్కారం ఎందుకు దొరకడం లేదు …మూలాలెక్కడ అనే కోణంలోంచి వచ్చిన ఆలోచనలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ధర్మాన ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలకు మూలంగా మారారని టాక్ .

సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని గుర్తించిన ధర్మాన తన ఫ్యూచర్ కోసం రాజకీయఅనుభవం లేదని విమర్శలు చేసిన వైసీపీలోనే వెతుక్కున్నారు . అప్పటికే వైసీపీలో చేరిన కొందరు నేతలు ధర్మాన రాకను పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని కండువాకప్పి పార్టీలోకి చేర్చుకున్నారు వైసీపీ అధినేత . ఈక్రమంలోనే గడచిన నాలుగేళ్లలో వైసీపీలో కీలకంగా , క్రియాశీలకంగా ధర్మాన వ్యవహరించినప్పటికీ అధినేత ఆయనకు జిల్లా పగ్గాలు అప్పగించకపోవడం పై పార్టీలో ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది .

ఐతే ఆనాటి కాంగ్రెస్ పార్టీలో మాదిరిగానే నేడు వైసీపీలో కూడా చక్రం తిప్పాలని భావిస్తున్న ధర్మాన…గ్రూపు రాజకీయాలను బాగా ప్రోత్సహిస్తుండటమే ఇందుకు కారణమని జగన్ భావిస్తున్నారట . తన నియోజకవర్గం వరకూ బాగానే పనిచేస్తున్న ధర్మాన ఇతర నియోజకవర్గాల్లో కూడా వేలుపెడుతున్నారని టాక్ . టెక్కలి , పలాస , ఇఛ్చాపురం , శ్రీకాకుళం నియోజకవర్గాలలో తన మాటవినని వైసీపీ నేతలకు పొమ్మనలేక పొగబెడుతున్నారని ఆపార్టీ శ్రేణులు బాహాటంగానే చర్చించుకుంటున్నారట . టెక్కలిలో దువ్వాడ శ్రీనుకు మంచి పట్టున్నప్పటికీ పేరాడ తిలక్ ను తెరపైకి తెచ్చారట . పార్టీ కార్యక్రమాల్లో దువ్వాడ చురుగ్గా ఉండటంలేదని అధిష్టానం పై ఒత్తిడి తెచ్చి మరీ పేరాడకు టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి పదవి కట్టబెట్టారట .

దీంతో నిన్నమొన్నటి వరకూ కూడా టెక్కలి వైసీపీలో లోకల్ పాలిట్రిక్స్ హాట్ హాట్ గా నడిచాయనేది బహిరంగ రహస్యం . ఈగోల మధ్యే వైఎస్ జగన్ దువ్వాడకు శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త పదవిని అప్పగించారట . ఇక కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కిల్లి కృపారాణి కూడా టెక్కలి వైసీపీ బరిలో నిలిచేందుకు పావులు కదిపినప్పటికీ ఆమె రాకకు ధర్మాన చెక్ పెట్టారనేది లోకల్ టాక్ . అటు పలాస లోనూ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన వజ్జె బాబూరావును కాదని …తన అనుచరుడైన డా.సీదిరిఅప్పలరాజుకు నియోజకవర్గ సమన్వయకర్త పదవి కట్టబెట్టారు . దీంతో వజ్జా టీడీపీలోకి జంప్ అయ్యారు. మరోవైపు ఇచ్ఛాపురంలోనూ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయినప్పటికీ ..ఆ తర్వాత కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన నర్తు రామారావును కాదని… పార్టీ సస్పెన్షన్ కు గురైన పిరియా సాయిరాజ్ ను వెనక్కు తెచ్చి నియోజకవర్గ ఇంఛార్జి పదవిని కట్టబెట్టేలా కీలకంగా వ్యవహరించింది ధర్మానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి .


ఈక్రమంలోనే ధర్మాన మీద జిల్లా పూర్తి భాద్యత పెట్టకపోవడానికి జగన్ ముందు అనేక కారణాలు ఉన్నాయనేది సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించే సమావేశాల్లో అంతా తానే అన్నట్లుగా కనిపించడమే తప్ప ధర్మాన చేసిందేమీ లేదనే అభిప్రాయం అటు పార్టీ నాయకులు , ఇటు కార్యకర్తల్లో ఉందట . ఇక అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నేల విడిచి సాము చేసిన మాదిరి అధికారపార్టీ నాయకుడిని , ముఖ్యమంత్రిని ఏకిపారేసే ధర్మాన జిల్లాలో వైసీపీకి కలిసొచ్చే అంశాల పై , అధికారపక్ష ఎమ్మెల్యేల తప్పిదాల పై ఎందుకు విరుచుకుడటం లేదో క్యాడర్ కే అర్ధం కావట్లేదట . నేను రాష్ట్రస్థాయి నాయకుడిని అని చెప్పుకునే ధర్మాన పోటీచేసేది మాత్రం శ్రీకాకుళం నుంచే అని ఎందుకు గుర్తించడం లేదో అని పార్టీ శ్రేణులు జుట్టుపీక్కుంటున్నారట.

ఈ క్రమంలోనే ధర్మానకు జిల్లాకు చెందిన పార్టీలోని ఇతర నేతలకు మధ్య అంతర్గతంగా దూరం పెరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయట . దీంతో జిల్లాలో పార్టీకి బలం అనుకున్న నాయకుడే పార్టీకి బలహీనంగా మారాడనే టాక్ వినిపిస్తుండటంతో వైపీపీ పార్టీకి సూచనలు సలహాలు అందించే పీకే ( ప్రశాంత్ కిషోర్ ) టీమ్ జిల్లాలో పార్టీ పరిస్థితులు , నాయకుల పనితీరు పై ఆరాతీసిందట . పార్టీలో కీలకంగా ఉన్న ధర్మాన ప్రసాదరావే ఇంటర్నల్ పాలిట్రిక్స్ ను ప్రోత్సహిస్తున్నారని పీకే తన రిపోర్ట్ లో తేల్చేసిందట . దీని పై హైకమాండ్ కు ఓ నివేదిక కూడా వెళ్ళిపోయిందన్న గుసగుసలు వైసీపీలో వినిపిస్తున్నాయట.

ఇదే విధంగా ధర్మాన కొనసాగితే … రానున్న ఎన్నికల నాటికి పార్టీ మరింతగా దెబ్బతినే అవకాశం ఉంటుందని పార్టీ అధిష్టానంతో పాటు జిల్లా నాయకులు , కార్యకర్తలు కూడా భావిస్తున్నారట . ఐతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పూర్తిగా చేజిక్కించుకుని చక్రం తిప్పిన ధర్మానకు…వైఎస్ జగన్ పార్టీ మాత్రం రాష్ట్రస్థాయి నాయకుడిగా ముద్రేసి వదిలేయడంతో ధర్మానతో పాటు ఆయన క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు మాత్రం వైసీపీలో చక్కర్లు కొడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో పాదయాత్రతో జిల్లాలో అడుగు పెట్టబోతున్న జగన్ సిక్కోలు రాజకీయాలను ఎలా సెట్ చేస్తారో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here