ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ని జేడీయూ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బహిష్కరణ దాదాపు నిర్ధారణ అయిపోయినా, అధికారికంగా ఇప్పుడే ప్రకటన వేలువండింది.

గత కొంతకాలంగా జేడీయు పార్టీ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ,పార్టీ నేత ప్రశాంత్ కిషోర్(PK) అస్సలు పడట్లేదు.ఇప్పటికే పార్టీ అంటే గౌరవం లేకపోతే పార్టీకి రాజీనామా చేసేయ్ అంటూ PK ప్రశాంత్ కిషోర్ కు నితీష్ వార్నింగ్ ఇచ్చాడు.

గత కొద్ది రోజులుగా CAA కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. CAA కు మద్దతుగా సీఎం నితీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అమిత్ షా చెబితేనే ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకున్నానంటూ నితీష్ వ్యాఖ్యలు గతంలో చేశారు. త్వరలో పార్టీ వీడనున్న ప్రశాంత్ కిషోర్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. చివరికి కథ బహిష్కరణతో సుఖాంతం అయింది.
మరో పక్క బహిష్కరణ అనంతరం ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. దేవుడే జేడీయూ ని కాపాడాలంటూ ట్వీట్ చేశాడు.