Home News Politics

కేంద్ర బడ్జెట్ భేష్: జేడీ లక్ష్మీనారాయణ! జనసేన రాజీనామాపై ఏమన్నారంటే!


కేంద్ర బడ్జెట్ పై జనసేన మాజీ నేత జేడీ లక్ష్మి నారాయణ ప్రశంసలు కురిపించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ యువతరాన్ని వ్యవసాయం వైపు దృష్టి సారించేదిగా ఉందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి తగిన నిధులు రావడానికి రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని కోరారు. సప్లిమెంటరీ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి మరిన్ని నిధులు రావచ్చని తెలిపారు.

తాను జనసేన కు చేసిన రాజీనామా ఆమోదం పొందిందని చెప్తూ రాజకీయాల ద్వారానే ప్రజలకు ఎక్కువగా మేలు చేయచ్చని తెలిపారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేదని అన్నారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని వివరించారు.

విజయవాడలో లక్ష్మీనారాయణ ఈ విషయాలు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here