Home News Politics

వాసుదేవయ్య C/o చింతలబస్తి

ఓరి నీ బిల్దప్పో ....

ఇదేవ‌న్నా సిన్మానా? స‌్పెడ్స్ పెట్టుకోగానే గుర్తుప‌ట్టకుండా ఉండేందుకు, ఓ కోటేసి క్రాఫ్ స్ట‌యిల్ మార్చేస్తే మ‌రో మ‌నిష‌నుకుని అమాయ‌కంగా చూసేందుకు. యాక్టింగ్‌లో గ‌బ్బ‌ర్‌సింగ్‌ని మించిపోయాడు దేవ్‌. వాసుదేవ్‌. వాసుదేవ‌య్య‌. మించిపోయాడ‌ని ముగ్గురి పేర్లు చెబుతున్నార‌నే క‌న్‌ఫ్యూజ‌నే వ‌ద్దు. ముగ్గురూ ఒక్క‌రే. కాక‌పోతే వాసుదేవ‌య్య పేరుని నైస్‌గా చెక్కితే చివ‌రికొచ్చిన ఔట్‌పుట్‌..దేవ్‌. ఈ దేవ్ ఎవ‌రో ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఏకంగా ప‌వ‌ర్‌స్టారే ఇంట్ర‌డ్యూస్ చేశాక మ‌ళ్లీ ప‌రిచ‌యం ఎందుకు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌కూ పోటీచేసి ల‌క్కు క‌లిసొస్తే జాక్‌పాట్ కొట్టేయాల‌ని పెద్ద టార్గెట్టే పెట్టుకున్న జ‌న‌సేన చీఫ్ స్ట్రాట‌జిస్ట్‌. అన‌గా ముఖ్య వ్యూహ‌క‌ర్త‌న్న‌మాట‌.

ఎప్పుడు ఏ డెసిష‌న్ తీసుకుంటాడో, ఎందుకు ఎమోష‌న్ అవుతాడో, ఒక్కోసారి అస‌లు ఎందుకు స్పందించ‌డో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కే తెలీదు. అలాంటి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌క్క‌న‌ స‌డెన్‌గా ఓ కొత్త మ‌నిషిని క‌నిపించేస‌రికి ఎవ‌రా అనుకున్నారు. పార్టీ శ్రేణులు జుట్టు పీక్కోక‌ముందే ఆయ‌నెవ‌రో చెప్పేశారు జ‌న‌సేనాని. జ‌న‌సేన ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలాంటి వ్యూహాలు ప‌న్నాలో, ఎలా నెగ్గుకురావాలో దిశానిర్దేశం చేసే వ్యూహ‌క‌ర్త‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌రిచ‌యం చేశాక‌..ఓ రేంజ్‌లో బిల్డ‌ప్పిచ్చేశాడు దేవ్. అంతా ఇంగ్లిపీసులోనే. తెలుగు కొంచెం కొంచె వ‌చ్చ‌న్న‌ట్లే ఫోజులు కొట్టేస‌రికి నిజ‌మే కామోస‌ని అంతా భావించారు. మొత్తానికి ప‌వ‌న్‌సార్ పీకే (ప్ర‌శాంత్‌కిషోర్‌)లాంటి స‌రుకుని దించార‌నుకున్నారు. సూటూబూటూ, మాటా అన్నీ ఆయ‌న చెప్పిందానికి అతికిన‌ట్లే స‌రిపోయినా…అస‌లేమిటీయ‌న బ్యాక్‌గ్రౌండ్ అని ఆరాతీస్తే మ్యాట‌రంతా బ‌య‌టికొచ్చేసింది.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న పార్టీ కీల‌క వ్యూహ‌క‌ర్త‌గా ఈ ప్ర‌పంచానికి, పార్టీ శ్రేణుల‌కు ప‌రిచ‌యం చేసిన దేవ్ అస‌లు పేరు వాసుదేవ‌య్య‌నీ, ఆయ‌నెక్క‌డినుంచో ఊడిప‌డలేద‌నీ, హైద‌రాబాద్‌లోనే చింత‌ల్‌బ‌స్తీకి చెందిన‌వాడ‌ని తెలిసేస‌రికి తెరుచుకున్న నోళ్లు చాలాసేప‌టిదాకా మూత‌ప‌డ‌లేదు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కేడ‌ర్ చెవుల్లో క్యాబేజీ పెట్టాల‌నుకున్నాడో, లేక‌పోతే వాసుదేవే జ‌న‌సేనాని చెవుల్లో క్యాలీఫ్ల‌వ‌ర్ పెట్టేశాడోగానీ..అయ్య‌గారి బ‌యోడేటా అంతా సోష‌ల్‌మీడియాలో షేర్ అయ్యేస‌రికి సారువాడి ప‌రువుపోయింది.

మొన్న‌టిదాకా బీజేపీతోనే ఉన్నాడు దేవ్ ఉర‌ఫ్ వాసుదేవ‌య్య‌. తెలుగు అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌డు. గ‌తంలో కిష‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో బీజేపీ మీటింగ్‌లో మాట్లాడాడు. ఆ పార్టీ త‌ర‌ఫున టీవీ డిస్క‌ష‌న్‌లో కూడా పాలుపంచుకున్నాడు. 2014 ఎన్నిక‌ల్లో స‌న‌త్‌న‌గ‌ర్ నుంచి పోటీచేయాల‌ని ఆశ‌ప‌డ్డా…పొత్తులో ఆ సీటు టీడీపీకి పోవ‌టంతో వెన‌క్కిత‌గ్గాడు. బీజేపీలో మాయ‌మై జ‌న‌సేన వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మ‌రి ఈయ‌న వ్యూహ‌క‌ర్త అవ‌తారం ఎప్పుడెత్తాడో, ఏ పార్టీలు ఆయ‌న్ని న‌మ్ముకున్నాయో, ఎవ‌రికి ఏ స‌ర్వేలు చేసిపెట్టాడో అంతా దైవాధీనం స‌ర్వీసే.

మొత్తానికి రాజకీయ వ్యూహకర్తల అంశం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ మోహన్‌రెడ్డి ప్రశాంత్ కిషోర్‌ను, పవన్‌కల్యాణ్ దేవ్‌ను పెట్టుకోవడంతో అసలు వీరు రాజకీయాలను ఎలా డీల్ చేస్తారన్న చర్చ జరుగుతూండగానే.. కొత్త అంశం బయటకు వచ్చింది. పక్క పార్టీ నేతే నేరుగా జనసేన వ్యూహకర్తగా మారడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నేప‌థ్యం ఏద‌యినా కావ‌చ్చు. దాప‌రికాలు, దాగుడుమూత‌లు ఎందుక‌న్న‌దే ప్ర‌శ్న‌. బీజేపీలో ప‌నిచేశాన‌నీ, ఫ‌లానా పార్టీల‌కు స్ట్రాట‌జిస్ట్‌గా సేవ‌లందించాన‌నీ, జ‌న‌సేన‌కు స‌ర్వీస్ చేసే అవ‌కాశం త‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌నో చెప్పుండొచ్చు. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేర‌న్న‌ట్లు క‌ల్పిత క‌హానీల కోటింగ్ ఎందుకో దేవ్‌గా మారిన మ‌హ‌దేవ‌య్య‌.. అంత‌కంటే ముందు ప్ర‌శ్నించేందుకే ఉన్నాన‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌వాబు చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here