జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ కమిటీ కన్వీనర్ విజయ్ బాబు మాట్లాడుతూ పార్టీ అన్నాక తిట్లు – పొగడ్తలు సహజమని.. దీన్ని భరిస్తామని సెలవిచ్చారు. స్టింగ్ ఆపరేషన్ గురించి తెలుగు పాపులర్ చానల్ ప్రశ్నించగా.. ఈ విషయంలో జనసేన పార్టీ అధికారికంగా స్పందించదని తేల్చి చెప్పారు. మహా టీవీ నుంచి వైదొలిగిన జర్నలిస్టు మూర్తి చేసిన విమర్శలకు స్పందిస్తే.. ఆయన్ను అనవసరంగా హీరోను చేసినట్టు అవుతుందని ఆయన తెలిపారు.
మూర్తి జనసేన పార్టీని టార్గెట్ చేసి మరింత పాపులారిటీ సంపాదించేందుకు రెడీ అయ్యాడని.. అందుకే ఆయన్ను పట్టించుకోం అని స్పష్టం చేశారు. తామేమీ అక్రమంగా డబ్బులు తీసుకోలేదని.. అన్ని పార్టీల లాగానే విరాళాలు సేకరించామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వారిలా కాంట్రాక్టుల నుంచి కమీషన్లు – ప్రాజెక్టుల్లో వాటాలు – మైనింగ్ లో డబ్బులు తీసుకోలేదని తెలిపారు. స్వచ్ఛందంగా జనసేనకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రజల నుంచే తీసుకున్నామని వివరణ ఇచ్చారు.