Home News Stories

జనసేన vs టీడీపీ వార్… పీక్స్ కి వెళ్ళిన చానల్ డిబేట్స్…

పవన్ మాట్లాడితే తాట తీస్తా అది చేస్తా ఇది చేస్తా అంటారు కాని.. ఆయన పక్కన కూర్చుని మల్లెపూలు నలపడం తప్ప ఏం చేయలేరంటూ లాంటి వివాదాస్పద కామెంట్స్‌తో జనసైనికుల ఆగ్రహానికి లోనైంది టీడీపీ యంగ్ లీడర్ యామిని. ఇప్పుడు మళ్లీ మల్లెపూల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.

లైవ్‌లోనే నోరు జారారు. మాటలు తూలారు. అందరూ చూస్తుండగానే.. నీకు సిగ్గుందా? అని ఒకరంటే.. అసలు నీవు ఎవరికి పుట్టావో తెలుసా? అంటూ లైవ్ షో నుండి వాకౌట్ చేశారు. టీడీపీ, జనసేన నాయకుల మధ్య ‘మల్లెపూల’ నేపథ్యంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్యక్తిగత దూషణలు, తిట్ల దండకంతో రచ్చ రచ్చగా మారింది. ఈ రచ్చంతా టీడీపీ మహిళా నాయకురాలు సాధినేని యామిని, జనసైనికుడు కళ్యాణ్ దిలీప్ సుంకరల మధ్య నడిచింది.

ఏపీ నుంచి నడిచే చానల్ డిబేట్‌లో పాల్గొన్న ఇరువురు లైవ్‌లో బూతు పురాణానికి తెరతీశారు. అబద్దపు హామీలతో టీడీపీ అధికారాన్ని చేపట్టిందని.. ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని.. చివరికి రాజధాని నిర్మాణం కూడా చేయలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు దిలీప్ సుంకర. ఆయన వ్యాఖ్యల్ని ఖండించిన యామిని.. ‘200 గజాల్లో మీరు 10 రోజుల్లో ఇళ్లు కట్టుకుని చూపించండి చాలు.. ఇంజనీరింగ్, మున్సిపాలిటీ, ప్లానింగ్ ఇలా అన్నీ చూసుకోవాలి. అలాంటిది ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలి. జనసేన పార్టీకి గాని, వైసీపీ పార్టీకి కాని ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అనేదే వాళ్ల ధ్యేయం. రాష్ట్ర అభివృద్దిని చూసి ఓర్చుకోలేక కడుపు మండి ఇలా రాళ్లు వేస్తున్నారు. ఇక్కడ కూర్చుని మీరు నేను మీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే కాదు.. రైతుల దగ్గరకి వెళ్లి మాట్లాడండి భూములు లాక్కున్నారో.. వాళ్లు ఇచ్చారో. 33 వేల ఎకరాలు రాజధానికి రైతులు ఇచ్చిన భూములే’ అంటూ దిలీప్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. రాజధాని రైతుల కోసం తూళ్లూరు వెళ్లి రైతుల్ని కలిసింది మా నాయకుడు. రైతుల కోసం మాట్లాడే అర్హత మీకు లేదంటూ యామినిపై ఫైర్ అయ్యారు దిలీప్ సుంకర. మీ నాయకుడి పవన్ కళ్యాణ్ గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారని యామిని అడ్డుతగలడంతో ఆగ్రహంతో ఊగిపోతూ నోరు జారారు దిలీప్ సుంకర. ఏం మాట్లాడుకుంటున్నారు? మా నాయకుడి గురించి? మల్లెపూలు, మంచం కోళ్లు గురించి మాట్లాడుకుంటున్నారా? మీ లాంటి మల్లెపూల పిచ్చ ఉన్నవాళ్లు మాట్లాడుకుంటున్నారేమో.. అంటూ గతంలో పవన్ కళ్యాణ్‌పై యామిని చేసిన మల్లెపూల కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు.

దిలీప్ సుంకర కామెంట్స్‌ని తిప్పికొట్టే ప్రయత్నంలో లైవ్ డిబేట్‌ని వాకౌట్ చేశారు యామిని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేము మహిళలము కాబట్టి మల్లెపూల పిచ్చ ఉందేమో కాని.. మీ ఇళ్లల్లో ఆడవాళ్లు లేరా? మీకు చదువు సంస్కారం ఉంటే ఇలా మల్లెపూల గురించి మాట్లాడరు. మీ ఇంట్లో మీ భార్య లేదా? మీ తల్లి లేదా? ఓ స్త్రీ గురించి ఇలాగే మాట్లాడతారా? మీరు ఎవరికి పుట్టారని నేను మాట్లాడవచ్చా? మల్లెపూలు అంటున్నారు? ఛీ.. ఛీ ఇలాంటి వాళ్లని చర్చలకు పిలుస్తున్నారా? మీ నాయకుడే చెండాలంగా ఉంటే మీరు ఇంతకంటే ఏం మాట్లాడతారు? మీరా రేపు ఓట్ల కోసం జనంలోకి వచ్చేది. మిమ్మల్ని ప్రతి మహిళ చెప్పులు తీసుకుని కొడుతుంది. సిగ్గు ఉండాలి ఓ మహిళ గురించి ఇలా మాట్లాడటానికి అతనికి లేకపోతే నాకు ఉంది. మీ నాయకుడి ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు అంటూ రోదిస్తూ డిబేట్‌ నుండి వాకౌట్ చేసింది యామిని.

అయినా జనసైనికుడు దిలీప్ సుంకర శాంతించలేదు. ఒళ్లు బలుపు గిల్లు బలుపు అంటే దవడ పగిలిపోద్ది.. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకు. నువ్వే మాట్లాడాలి సిగ్గు, శరం గురించి మల్లెపూలు నలిపించుకోవడం గురించి. అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడం చేతకాదు. నువ్వు మా నాయకుడ్ని విమర్శిస్తావా? అంటూ లైవ్‌లోనే నోటికి పనిచెప్పాడు జనసైనికుడు. దీంతో అతను చేసిన వ్యాఖ్యలకు గానూ చట్టపరంగా చర్యలు చేపడతానని హెచ్చరించారు యామిని. మొత్తానికి ‘మల్లెపూలు’ కామెంట్స్‌కి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటే.. మరోసారి అగ్గి రాజేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here