Home News Politics

అమిత్ షా సభకు పవన్ కళ్యాణ్: లక్ష్మణ్ వెల్లడి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి అమిత్ షా సభ గురించి వివరించారు. దానితో పాటిగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడి గురించిన అంశాలు కూడా చెప్పారు. ప్రెస్ మీట్ హైలైట్స్ చూడండి:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని తమ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తోందన్న లక్ష్మణ్

పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రాల అధ్యక్షులు మారటం సహజమే

మార్చి 15న హైద్రాబాద్ లో సీఏఏకు అనుకూలంగా భారీ బహిరంగ సభ

ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు

జనసేన మా మిత్రపక్షం.. పవన్ కళ్యాణ్ ను కూడా సభకు ఆహ్వానిస్తాం

ఉద్యోగ సంఘాల నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులు బలవుతున్నారు

ఉద్యోగ సంఘాల నేతల తీరుతో.. అనేక మంది తమ ప్రయోజనాలు కోల్పోతున్నారు

ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన మంత్రి.. ఉద్యోగులను పట్టించుకోవటం లేదు

ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారనుకోవటం ఉద్యోగ సంఘాల నేతల పొరపాటు

ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం

ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారైందన్న‌ లక్ష్మణ్

ఆరేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయింది

ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్ళల్లో ఒత్తులేకుని ఎదురుచూస్తున్నారు

నిరుద్యోగ భృతి రూ.3,016 చెల్లిస్తామని కేటీఆర్ మాట తప్పాడు

ఎన్నికలున్న జిల్లాలోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు

రెవెన్యూ వ్యవస్థను ఎత్తేస్తామని ముఖ్యమంత్రి ఉద్యోగులను బెదిరిస్తున్నారు

ఓవైసీ కోసమే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడ్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here