Home News

ఆ ఏకైక ఎమ్మెల్యే రూటు ఎటూ…?

పార్టీ మారడం ఖాయమనుకున్న ఆ ఎమ్మెల్యే కొత్త రూట్ పట్టినట్లు కనిపిస్తున్నారు … విపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ… అక్కడి నియోజకవర్గ అధికారపక్ష కోఆర్డినేటర్ తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు .. అయితే అక్కడ సీన్‌ పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్నా… అసలు సంగతి వేరే ఉందన్న చర్చ జరుగుతోంది… రాజుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సెగ్మెంట్లో .. మారుతున్న రాజకీయ సమీకరణలు ఇప్పుడు ఆసక్తిరేపుతున్నాయి…

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ రాజకీయాలు వెరైటీగా సాగిపోతున్నాయి .. అక్కడ పైకి కనిపించే సీన్‌ ఒకటైతే … ఇంటర్నల్‌గా ఇంకేదో జరిగిపోతోందంట… ఇటీవల ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు … వైసీపీకి చెందిన బొంతు రాజేశ్వర్రావు పై విజయం సాధించి పవన్ పార్టీ నుంచి రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు…

పార్టీ అధినేత సైతం ఓటమిపాలైన ఎన్నికల్లో… రాపాక వరప్రసాద్ మాత్రం 814 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నియోజకవర్గం నుంచి గెలిచి .. రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు… అటు చూస్తే క్యాబినెట్‌ బెర్త్‌పై బోల్డు ఆసలు పెట్టుకున్న వైసీపీ క్యాండెట్‌ రాజేశ్వరరావు రాజోలు నుంచి వరుసగా రెండోసారి ఓటమిపాలయ్యారు.. అదలాఉంటే ఓడిపోయిన రాజేశ్వరరావుకి అక్కడి అధికారులు ప్రోటోకాల్ పాటిస్తున్నారంటూ … ఇటీవల జరిగిన రైతు దినోత్సవంలో స్థానిక జనసేన ఎమ్మెల్యే గొడవకు దిగటం రాజోలు రాజకీయాల్లో వేడిపుట్టించింది….

అయితే రాజోలు నియోజకవర్గ రాజకీయాల్లో పైకి కనిపించేది ఒకటి .. అసలు సంగతి వేరే ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది… ఎన్నికలకు ముందు నుంచి జరిగిన పరిణామాల గురించి చెప్పుకుంటే … 2009 నుంచి 2014వరకూ రాజోలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాపాక వరప్రసాద్ … ఈ సార్వత్రిక ఎన్నికలకు కొన్నినెలల ముందు వరకూ వైసిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు… అయితే చివరికి జనసేన అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు…

మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీర్ ఇన్ ఛీఫ్ గా కీలక బాధ్యతలు నిర్వహించిన బొంతు రాజేశ్వర్రావుకు…. ఆయన తండ్రి వైఎస్‌కు సన్నిహితుడు కావడంతో వైఎస్‌ జగన్‌ రెండోసారి కూడా టిక్కెట్ ఇచ్చారు… అయితే పార్టీ హవా కొనసాగినా .. కాలం కలిసిరాక బొంతు రాజేశ్వర్రావుకు ఈ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు… ఆ క్రమంలో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రాపాక వరప్రసాద్… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు… అయితే ఆయన వైసిపిలోకి వెళ్లేందుకు ఆస్కారం లేని పరిస్థితుల్లో … బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు రాపాక… అందుకే విపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ రాపాక అనుకున్న విధంగానే నియోజకవర్గంలో అధికారుల బదిలీలు జరిగాయనే మాట వినిపిస్తోంది …

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓవైపు తాను గెలిచిన పార్టీలోనే కొనసాగుతూ… మరోవైపు వైసిపి అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలనే రూట్ లో వెళ్తున్నారనే మాట ఇక్కడి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది… అందులోభాగంగా ముఖ్యమంత్రి అండదండలు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఉండేలా … రాజోలుకు చెందిన కొందరు బడా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్, అమరావతి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంట … వారి స్కెచ్‌ వర్కౌట్‌ అయిత ప్రస్తుత వైసిపి ఇన్‌ఛార్జ్ కు రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారని … జనసేన ఎమ్మెల్యేని పరోక్షంగా వైసిపి అనుబంధ ఎమ్మెల్యేగా పరిగణించి అన్ని విధాలుగా సహకారం అందిస్తారని ప్రచారం జరుగుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here