తమ సంపూర్ణ మద్దతు బీజేపికి అని తెలియజేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్…. కార్యకర్తలు ఎలాంటి నిరుత్సాహం చెందకుండా కలిసికట్టుగా బాజాపాకి పట్టంకట్టాలని పిలుపు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నాయకుడు కె.లక్ష్మణ్ తో చర్చించిన అనంతరం నిర్ణయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలు హైలైట్స్
? బీజేపీ కి జనసేన సంపూర్ణ మద్దతు.
? అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో లాగానే తెలంగాణ లోను కలిసి పనిచేయలనుకున్నాం. కానీ, కరోన కారణాల వల్ల అప్పట్లో కుదరలేదు.
? హైద్రాబాద్ విశ్వనగరంగా మోడీ నాయకత్వం లో సాధ్యమవుతుంది.
? బీజేపీ ghmc ఎన్నికల్లో గెలవాలి.
? ఒక్క ఓటు కూడా బయటకు పోకుండా జనసైనికులు బీజేపీ కి సహకరించాలి.
? మనం ఎన్నికల్లో పోటీ చేయడంలేదని జనసైనికులు నిరాశపడొద్దు
బీజేపీ సీనియర్ నాయకులు – డా.కె లక్ష్మణ్
- – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
?️ గ్రేటర్ లో జనసేన తో కలిసి మెడీ నాయకత్వాన్ని బలపరుస్తాం.
?️ గ్రేటర్ ఎన్నికల తరువాత కూడా జనసేన బీజేపీ బంధం కొనసాగుతుంది.
?️ దుబ్బాక లాగే గ్రేటర్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాం.
?️ గ్రేటర్ లో బీజేపీ తరపున ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు పెద్దమనసుతో ఒప్పుకున్నారు.
?️ బీజేపీ కి జనసేన తోడుంటే పూర్తిస్థాయిలో మార్పు సాధ్యం.
కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి
దేశంలో బీజేపీ మోడీ నాయత్వంలో మద్దతిస్తున్నారు
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
గ్రేటర్ లో అది కనిపిస్తుంది
వరదలు లేని…మురికి రాని ఇల్లు కావాలని… అవినీతి లేని పాలన కావాలని కోరుకుంటున్నారు
మంచి అవినీతి లేని పాలన కావాలి
గులాబీ గ్రాఫిక్స్ కాకుండా… ప్రాక్టికల్ అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు
అది బీజేపీ తోనే సాధ్యం అనే విశ్వాసం కనిపిస్తోంది
ఇదే హైదరాబాద్ ఎక్కడ పోయిన కనిపిస్తుంది
జనసేన కూడా మాతో కలిసి రావాలని కోరాం
పవన్ కూడా బీజేపీ విజయం కోసం పని చేస్తామన్నారు
హైదరాబాద్ ప్రజలు మార్పు తీసుకుని వస్తారు
ఈ మార్పులో జనసేన భాగస్వామ్యం అవుతుంది