Home News Politics

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో విషాదం..

జనసేన పార్టీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. అసలే పార్టీ ఓడిపోయి.. ఉనికి నిలుపుకునే క్రమంలో ఒక్కడే అన్నీ అయి పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయనకు తోడుగా ఉండేవాళ్లే కరువవుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో ఓ జిల్లా కీలక నేత కన్నుమూసాడు. పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తున్నాడు. మొన్నటి వరకు రాజకీయాలు చేసి ఇప్పుడే సినిమా షూటింగ్స్ కు వచ్చిన పవన్‌కు ఇప్పుడు పిడుగు లాంటి వార్త తెలిసింది. జనసేన పార్టీలో నూజివీడు నుంచి చాలా కీలకంగా ఉన్న నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు మరణించాడు. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో ఫిబ్రవరి 22న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కన్నీరు పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఆయనతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకుని.. పార్టీకి భాస్కరరావు చేసిన సేవలను కొనియాడారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నూజివీడులో జనసేన పార్టీ బలోపేతం కావడానికి భాస్కరరావు చాలా కృషి చేసారని.. అదంతా జనసైనికులు ఎప్పటికీ మరిచిపోలేరని తెలిపాడు పవన్. రాజకీయంగా నూజివీడు ప్రజలకు ఆయన సేవలు కూడా అజరామరం అని తెలియచేసాడు పవర్ స్టార్. చిన్న వయసులోనే ఆయన చనిపోవడం బాధాకారమని తెలిపాడు పవన్. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తన తరఫున, తన పార్టీ తరఫున భాస్కరరావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపాడు పవన్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు పవర్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here