గోషామహల్ పీఎస్ లోనూ నిరసన తెలిపారు జనసేన నేతలు, కార్యకర్తలు. ఇటీవల మరణించిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.Globarena సంస్థ కాంట్రాక్టు రద్దు చేయాలని అన్నారు.
ఇంటర్ గొడవ: గోషామహల్ పీఎస్ లో జనసేన నిరసన
విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్ని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలకు కారకులైన బోర్డు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. నిరసన తెలిపిన వారిలో నసేన నేత శంకర్ గౌడ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.