Home News Politics

జగ్గారెడ్డి అరెస్టుకు కారణం ఇదేనా !..

తెలంగాణ కాంగ్రెస్ కీ లీడర్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్టయ్యారు. గుజరాత్ కి చెందిన ముగ్గురిని తన కుటుంబ సభ్యుల పేరుతో అమెరికా కి తరలించినట్లు ఆరోపణలున్నాయి. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం జగ్గారెడ్డి 2004లో తన అధికారిక లెటర్‌ ప్యాడ్‌పై ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి లేఖ రాశారు. జగ్గారెడ్డి తన భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయి రెడ్డిలకు వెంటనే పాస్‌పోర్టు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అమెరికా వీసా తీసుకునేప్పుడు కూడా నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారు. వాటి సాయంతో ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని ఆయన తనవెంట అమెరికా తీసుకెళ్లారు. కానీ, జగ్గారెడ్డి మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చారు’’ అని డీసీపీ వివరించారు. నిజానికి, 2004లో జగ్గారెడ్డి కుమారుడు భరత్‌సాయి వయసు నాలుగేళ్లేనని.. పాస్‌పోర్టు కోసం తప్పుడు విద్యార్హత డాక్యుమెంట్లు సమర్పించి, అతడి వయసును 17 సంవత్సరాలుగా పేర్కొన్నారని వెల్లడించారు. అలాగే.. ఆయన కూతురు జయలక్ష్మి 1997లో జన్మించిందని, పాస్‌పోర్టులో మాత్రం 1987గా పేర్కొన్నారని తెలిపారు.

ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
ఇదిలా ఉండగా జగ్గారెడ్డి అరెస్టుని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. డీజీపీ ఇంటికి వెళ్ళిన ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌ జగ్గారెడ్డి పై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని వెంటనే విడుదల చేయాలన్నారు. జగ్గారెడ్డి అరెస్టు పై ఆయన అభిమానులు ఈరోజు సంగారెడ్డి బంద్ కి పులుపునిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here