Home News Politics

జగన్ తనకు శత్రువు కాదు మిత్రుడే అంటున్న పవన్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఎవరికి మిత్రుడో ఎవరు ఎవరికో శత్రువో తెలియని కన్ ఫ్యూజన్ నడుస్తుంది… ఎవరు ఎవరి పై విరుచుకుపడతారో సడన్ గా ఎవరు ఎవరి పై ప్రేమ చూపుతారో తేల్చుకోలేనంతగా రాజకీయం నడుస్తుంది. అవును మరి రాజకియాల్లో అవగాహన వేరు,అధికారం వేరు,స్నేహం వేరు కాని ఒక్కోసారి ఇవన్ని ఒకదానికొకటి సమీప బందువుల్లానే కనిపిస్తుంటాయి. ఇక ఏపీ పాలిటిక్స్ లో జనసేనాని పవన్, వైసీపి అధినేత జగన్ మధ్య ఉన్న గ్యాప్ గురించి ఛెప్పాల్సిన పని లేదు. అలాంటిది సడన్ గా జగన్ తనకు శత్రువు కాదు మిత్రుడంటున్న పవన్ వ్యాఖ్యలతో వీరి మధ్య ఎదో సమ్ థింగ్, సమ్ థింగ్ అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతుంది….

ప్రజలకు పథకాలు ప్రకటించి బుట్టలో వేసుకుంటాయి అన్ని రాజకియ పార్టీలు. అవే స్కీములు పొలిటికల్ లీడర్స్ అయిన తమ మధ్యలోనూ అంతర్గతగా ఉంటాయంటున్నారు. వాటినే పొలిటికల్ పరిభాషలో పాచికలు లేదా పన్నాగాలు అని పిలుచుకోవాలి. గత ఎన్నికల్లో టీడీపీతో చేతులు కలిపిన పవన్ చంద్రబాబు అనుభవిస్తున్న అధికారానికి తానే కారణం అంటాడు. అప్పటి ఎన్నికల్లో పవన్ వెన్నుదన్నుగా నిలవడంతోనే సైకిల్ పార్టీ సీఎం సీటు దక్కించుకుందని జనసైనికుల నమ్మకం. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు అలాంటివి. కొన్నాళ్ళు వీరి బంధం సాఫీగానే సాగింది. ఆ తర్వాత రాజకీయాల్లో ముందస్తు బేరసారాలు లేకుండా బేషరతుగా ఎవరు ఎవరికీ మద్దతు ఇవ్వకూడదన్నది తెలిసి వచ్చింది. కాని జనసేన రాజకియ భవిష్యత్ ఎక్కడ అన్నప్పుడు పవన్ కోటరి నుంచి వచ్చిన ఆన్సర్ ఎటాక్ టూ ఎల్లో పార్టీ అని ఎందుకంటే తోకపార్టీగా రాష్ట్రంలో మిగిలిపోకుడదంటే ఇదే కరక్ట్ అన్నది డేషీషన్ మరి.

ఇక అంతే పవన్ రూటు మార్చారు. ప్రత్యేక హోదా, ప్రభుత్వ స్కాం ల పై ఫైరవుతూ మొదటి తూటా చినబాబు లోకేశ్ పై పేల్చారు. ఇది వర్కవుట్ అయ్యింది. టీడీపీకి ప్రత్యర్థిగా తమను ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు. తన అజెండాను తాను నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకేం వైసీపీ కి పోటిగా ప్రభుత్వం పై దాడిని ముమ్మరం చేశారు. కాని ఇక్కడే చిక్కోచ్చిది. టాట్ ఉంటే గింటే టీడీపీకి ప్రత్యామ్నాయం నేనవ్వాలి కాని పవన్ ఎవ్వరు అంటు ఒకనోక రోజు పవన్ ప్యామిలీ మ్యాటర్స్ పై ఫైరయ్యాడు వైసీపీ అధినేత జగన్. ఇంకేముంది టీడీపీని వదిలి జనసేన,వైసీపీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు ఈ గేమ్ లో టీడీపీ సేఫ్ అయింది. కానీ ప్రతిపక్ష పార్టీలు రెండు ఫైట్ చేసుకుంటే మళ్ళీ పసుపు పార్టీదే అధికారం…ఇక్కడ మళ్ళీ మేల్కొన్నాయి ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు.

ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పోటి చేస్తే అధికారం సాధిస్తుందా అంటే అది అసాధ్యం. దీని వల్ల కొన్ని చోట్ల తెలుగుదేశానికి, మరికొన్ని చోట్ల వైసీపీకి లబ్ధి చేకూరుతుందని తేలింది. ఒక పార్టీగా జనసేనకు కలిగే లాభం కంటే పోటీవల్ల తెలుగుదేశం, వైసీపీలకే ఎక్కువ ప్రయోజనమని స్పష్టమైంది. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల అంతిమంగా కలిసోచ్చేది అధికారపార్టికే. జనసేన పోటివల్ల మళ్ళీ టీడీపీ లబ్దిపొందుతుందన్న చేదు నిజం జనసేనానికి సుతారం నచ్చలేదు. అందుకే మళ్ళీ ఏపీ విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ తనకు శత్రువు కాదని.. ఆ మాటకు వస్తే తనకు శత్రువులు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు పవన్.

జగన్ తనకు శత్రువు కాదన్న పవన్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రెండు పార్టీలు ఏదో ఒక అవగాహనతో ఎన్నికలకు వెలితే ప్రయోజనం అన్న విషయం రెండు పార్టీలకు తెలిసోచ్చింది. అయితే వైసీపీ, జనసేనల మధ్య ప్రత్యక్షంగా పొత్తు కుదిరే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. దానివల్ల రెండు పార్టీలు నష్టపోతాయి. అందుకే ఏ పార్టీకి ఎక్కడ బలముందో సర్వేలతో అంచనా వేసుకుని పరస్పరం సహకారం అందించుకోవడం ద్వారా గమ్యాన్ని చేరోచ్చన్నది రెండు పార్టీల మదిలో ఉన్న ఆలోచన అని తెలుస్తుంది. ఈ పరిణామ క్రమంలోనే పవన్ నోటి నుంచి జగన్ మీద సానుకూల వ్యాఖ్యలు అని పొలిటికల్ విశ్లేషకుల అంచనా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here