Home News Politics

జగన్ కి ప్రశాంత్ కిషోర్ హ్యాండిచ్చారా ?

బీహార్‌ నుంచి నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా అంటున్న పొలిటికల్ ఫ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైసీపీని అధికార తీరాలకు చేర్చరా…. తన దారి తాను చూసుకుంటున్న ఈ నయా పొలిటికల్ ఎనలిస్ట్ కు జగన్ కు ఎక్కడ గ్యాప్ వచ్చింది….వైసీపీ లోగుట్టు తెలిసిన ప్రశాంత్ కిశోర్‌ జేడీయులో చేరికతో నితీశ్ కి సన్నిహితుడైన చంద్రబాబు దగ్గరవుతారా…..

2014లో అతివిశ్వాసంతో దెబ్బతిన్న వైసీపీ ఈ ఎన్నికలు లైఫ్ ఎన్డ్ డెత్ అంటూ ఎన్నికలకు రెండుసంవత్సరాల ముందే భారీ ప్యాకేజ్ తో పీకే టీంను అప్రోచ్ అయింది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంతకిశోర్ రంగప్రవేశం చేసి పార్టీలో ఓ జోష్ క్రియోట్ చేశారు. పార్టీ లోపాలను, ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది పీకే బృందం. దానికనుగుణంగా జగన్ వ్యవహారశైలి నుంచి పార్టీ విధానాల వరకూ అనేక సూచనలు మార్పులు,చేర్పులు చేసింది. ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేపట్టాలంటూ వైసీపీ అధినేత జగన్ కు ప్రశాంత్ కిశోర్ సూచించారు. నవరత్నాల పేరిట మినీ ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేశారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా క్యాంపెయిన్ స్ట్రేటజీని సిద్దం చేసిన ప్రశాంతకిశోర్ ఇంతలోకే హటాత్తుగా బీహార్ నుంచి ప్రత్యక్ష రాజకియాల్లోకి ఎంటరయ్యారు.

గడిచిన కొన్ని నెలలుగా పీకే టీం లు వైసీపిలో యాక్టీవ్ గా లేవా. అసలు జగన్ కి ప్రశాంత్ కిశోర్ కి ఎక్కడ చెడింది. పాదయాత్రలోనూ నిరంతరం నీడలా ఉన్న పీకే టీంలు బీహార్ కు షిఫ్ట్ అవుతున్నాయా…. అవును మరి ఇంతకాలం పొలిటికల్ పార్టీలకు ఫ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. నితీశ్ తర్వాత జేడియూలో ఎవరు అనుకుంటున్న సమయంలో ప్రశాంత్ సడన్ గా బీహార్ పాలిటిక్స్ లో ఎంటరయ్యారు. నితీశ్ ఇన్టర్నల్ గా తన వారసుడు పీకే అని ప్రకటించి పొలిటికల్ పార్టీలకు షాకిచ్చారు. గతంలో జేడీయూ అధికారలోకి రావాడానికి ప్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత నితీశ్ కి చేదోడువాదోడుగా ఉన్నాడు.

ప్రశాంత్ కిశోర్ తనదారి తాను చూసుకున్నారు ఓకే మరీ భారీ ప్యాకేజ్ తో తనను సెట్ చేసుకున్న వైసీపీ పరిస్థితి ఏంటి. ఇప్పటికి దాదాపు పన్నెండు సర్వేలు నిర్వహించిన పీకే టీం ఎక్కడెక్కడ వైసీపీని బలహీనతలు వెన్నాడుతున్నాయో కనిపెట్టి వాటిని సరిదిద్దే బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో నితీశ్ సన్నిహితుడైన చంద్రబాబుకు వైసీపీ రిపోర్ట్ చేరే అవకాశం ఉందా అన్నడి మిలియన్ డాలర్ల ప్రశ్న. వైసీపీకి సమయం కేటాయించలేనని తేల్చేసిన ప్రశాంత్ కిశోర్ నిష్క్రమణతో వైసీపీ నాయకులు కుడా ఇక పీకే సేవలు ముగిసినట్లే అని తేల్చేశారు. పీకేకు, జగన్ కు మధ్య ఆలోచనల్లో కొంత అంతరం ఏర్పడిందని ఆ తర్వాతనే పీకే తన యాక్టివ్ రోల్ ను కుదించుకున్నారనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని వల్ల పార్టీకి కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నాయకులు చెబుతున్నారు.

అధికార టీడీపీ పొలిటికల్ ఫ్యూహాలకు పదును పెడుతుంటే వైసీపీ ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతోంది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 15 శాతం వరకూ ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునే విషయంలో ఇంకా వైసీపీ వెనకబడే ఉంది. రిజర్వేషన్లు సాధ్యం కాదని, కేంద్రం నిర్ణయించాలని ఒకానొక సందర్బంలో తేల్చి చెప్పేశారు జగన్. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొంత సర్దుబాటు, దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. కానీ ఆ సామాజిక వర్గంలో పూర్తి సానుకూలత తెచ్చుకోలేకపోయారు.

జనసేనాని పవన్ కల్యాణ్ ఓటింగ్ పై ఇంతవరకూ కచ్చితమైన అంచనా లేకపోవడం పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు నాయుడి పొలిటికల్ మేనేజ్ మెంట్ పై ఇప్పుడిప్పుడే వైసీపీ అగ్రనాయకత్వం ఒక అవగాహనకు వస్తోంది. ప్రతివ్యూహాలను సిద్దం చేసుకోకపోతే దెబ్బతింటామని ఇటీవలనే జగన్ ద్వితీయశ్రేణి నాయకులను హెచ్చరించారు. ప్రజాసంకల్పయాత్రలో వస్తున్న స్పందన ను పార్టీ అందిపుచ్చుకోలేకపోంతుందన్న అంశంలోను క్లారిటీకి వచ్చి దిద్దుబాటు చర్యలకు దిగారు వైసీపీ బాస్.

ఎన్నికష్టాలు, ఎదురీతలు ఉన్నప్పటికీ వైసీపీకి ఊరటనిచ్చే అంశం ఒకటుంది. జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో 43 శాతం వరకూ ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వెలువడిన అంచనాలు పార్టీలో కొండంత భరోసానిచ్చాయి. ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంపార్టీ కంటే దాదాపు అయిదు శాతం మేరకు అధిక ఓటింగు లభిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే శాంపిల్ సైజు తక్కువగా ఉన్నాఈ సర్వే ఒక పాజిటివ్ అంశమే. ఇప్పట్నుంచి పొరపాట్లు చేయకుండా ఓట్లను సంఘటితం చేసుకుంటూ పోతే అధికార సాధన కష్ట సాధ్యం కాదని వైసీపీ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here