Home News Updates

దటీజ్ జగన్… అంబానీ కే సవాల్

రాజకీయాల్లో నూతన ఒరవడికి జగన్ శ్రీకారం చుట్టారు.. చుడుతున్నారు కూడా .. గతం లో తన పార్టీ ఎం ఎల్ ఏ లు సైకిల్ ఎక్కినప్పుడు పార్టీ కి రాజీనామా చేసి వెళ్లాలని హెచ్చరించారు ., ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వై సి పి లోకి వస్తాను అని చెప్పినా ముందుగా ఎం ఎల్ సి పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. ఇలా విలువలు వున్న రాజకీయాలు నడపాలని అందరికి చెప్పారు .

ఇప్పుడు రాజ్య సభ అభ్యర్థుల విషయం లోను చాలా ఖచ్చితంగా వ్యవహరించారనే చెప్పాలి . పరమళ్ నత్వానీ అనే అంబానీ సన్నిహితుడికి అవకాశం ఇచ్చారు . ఇది ప్రధాని మోడీ ., అమిత్ షా సూచనల ప్రకారమే కావచ్చు కానీ., ఇక్కడ జగన్ ఒక షరతు పెట్టారట.
పరమళ్ నత్వానీ ని ఇండిపెండెంట్ గా నిలపాలని ఢిల్లీ పెద్దలు సూచించినా ఇండిపెండెంట్ కు అవకాశం ఇచ్చేది లేదని తమ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని తమ పార్టీ తరఫునే రాజ్యసభలో ఎంట్రీ ఇస్తే.. ఓకే అని జగన్ అంబానీకే షరతు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. దీని వల్ల వైసీపీకి కొన్ని లాభాలున్నాయి. రాజ్య సభలో తమ సంఖ్య తమకు నిలబడుతుంది. రేపు ఏదైనా కీలక బిల్లులు వచ్చినప్పుడు నత్వానీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ కు కట్టుబడాల్సి ఉంటుంది. అందుకే తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఆయనను రాజ్యసభ కు పంపుతామని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు నత్వానీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

నామినేషన్ దాఖలు చేయడానికి ముందే.. మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను వేయించుకున్నారు. తద్వారా ఆయన రాజ్యసభ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగనున్నారు.

ఇది వరకటిలా ఇండిపెండెంట్ అనే లెక్కలో కాకుండా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఏపీ అసెంబ్లీ కోటాలో ఎన్నికైన సభ్యుడిగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here