Home News Politics

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు, పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందే..! – సుప్రీం

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వానికి , ఎన్నికల సంఘానికి కోనసాగుతున్న పంచాయితీ ఎన్నికల వివాధం నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. పంచాయితీ ఎన్నికలు ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు వాయిదావేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన ఫిటీషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను రాష్ట్ర హైకోర్టు కోట్టివేయగా సుప్రీం కోర్టులో ఫిటీషన్ వేసింది. దీంతో సోమవారం జస్టీస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఏపీ పంచాయితీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు పాలుపంచుకోలేమని, సహకరించబోమని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టగా.. పని చేయకుండానే ఫిటీషన్ వేయడం ప్రమాదకరమని సుప్రీం వ్యాఖ్యానించింది.
ఉద్యోగ సంఘాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని..కరోన వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని..ఇప్పుడు ప్రభావం తగ్గిన తర్వాత వద్దని అంటున్నాయని జస్టీస్ కౌల్ చెప్పారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల కోసం మేమే ఆదేశాలిస్తున్నమన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఆపాలని ఎలా చెప్పాలి?” అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here