ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సోమవారం జగన్ ఢిల్లీ పర్యటన పై ఆసక్తికర చర్చ నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతో పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్ పై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని భావించారు. మరోవైపు వ్యాక్సిన్ల లభ్యతపై ఇతర రాష్ట్రాల సీఎంలను జగన్ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం జగన్ పర్యటనలో భాగంగా అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులను కలుస్తారని నిన్న ప్రచారం జరిగింది. వ్యాక్సిన్ల కొరత పై అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖలు రాయగా అందులో సంధించిన ప్రశ్నలను ప్రధాని మోడీని ఎందుకు అడగడంలేదంటూ విపక్ష పార్టీలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల అంశంపై కేంద్రంతో జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.