Home News Politics

ఒక్క కత్తిపోటు వంద డౌట్లు—మల్లెల బాబ్జీ,ఎన్టీఆర్ ఎపిసోడ్ కి లింకేంటి…?

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల మంటలు తారాస్థాయికి చేరాయి. ఇది ప్రీ ప్లాన్ద్ స్కెచ్ అంటూ అధికార టీడీపీ,చంద్రబాబుకు మానవత్వం లేదంటూ వైసీపీ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఇంకో పక్క ఇదాంత ఆపరేషన్ గరుడలో భాగంగా కమలం పార్టీ స్ట్రాటజీ అంటు మరికొందరు బాకాలుదారు.

ఈ ఘటన పై సీఎం చంద్రబాబు స్పందన మరీ ఎబ్బెట్టుగా ఉంది. దాడి ఎలా జరిగినా దానిని ఖండిస్తున్నాం అని ఒక్క మాట మాట్లాడకుండా జగన్ పై జరిగిన దాడి లైట్ తీసుకోవాలంటూ, ఆయిట్ మెంట్ రాసుకుంటే తగ్గే గాయానికి హడావిడి అవసరమా అంటూ మీడియాకి హితబోదా చేశారు. అప్పట్లో అలిపిరిలో చంద్రబాబు పై దాడి జరిగితే మొదట స్పందించి ఖండించింది వైఎస్ మాత్రమే. పాలిటిక్స్ లో లక్షా తొభై ఉండోచ్చు కానీ ఆ సందర్భంలో ఒక లీడర్ వ్యవహరించాల్సిన తీరు సీఎం చంద్రబాబులో ఏ మాత్రం కనిపించలేదు. దాడి జరిగి గాయపడితే ఫ్లైట్ ఎలా ఎక్కించుకున్నారని, ప్రభుత్వ ఆప్సత్రికి వెళ్ళకుండా ప్రవేట్ ఆస్పత్రి అది హైదరాబాద్ వెళ్ళడం ఏంటంటూ చిల్లర సందేహాలు వ్యక్తం చేశారు.

శివాజి అనే సినిమాస్టార్ చెప్పిన గరుడపుపురాణం కథలు ఇక ఇప్పుడు హైలెట్ గా మారాయి. మోడీ స్క్రిప్ట్ లో భాగంగానే ఈ సినిమా నడుస్తుందంటూ గగ్గోలు పెట్టారు మరికొందరు నేతలు….ప్రతిపక్షనేత పై దాడి ప్లాన్ ప్రకారం జరిగిందంటూ రాష్ట్రంలో అలజడి రేపి శాంతిభద్రతల సమస్యతో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తారంటూ గరుడ పురాణం చెబుతున్నప్పటికి…అసలు దిమాక్ ఉన్నోడు ఎవడు ఎన్నికల ముంగిట్లో సర్కార్ ని రద్దు చేసి సానుభూతి సంపాదించి పెడతాడా….

జగన్ తగిలిన కత్తిపోటు ఏపీ పాలిటిక్స్ లో వంద గాయాలను రేపింది. ఇక ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో 1984లో జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. జగన్‌ పై దాడి ఘటన గురించి తెలిసిన వాళ్లలో కొందరు ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జీ చేసిన కత్తి దాడి ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.

అదేంటంటే.. 1984లో కూడా ఏపీలో ఇదే తరహాలో ఓ దాడి జరిగింది. అప్పట్లో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుపై ఈ దాడి జరిగింది. ఓ 22ఏళ్ల వయసున్న యువకుడు మల్లెల బాబ్జీ ఎన్టీఆర్‌పై దాడి చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఘటన జరిగింది. ‘ఇందిరా గాంధీ జిందాబాద్’ అని కేకలు వేస్తూ బాబ్జీ ఎన్టీఆర్‌పై దాడి చేశాడు. ఈ దాడి ఘటనలో ఎన్టీఆర్ వేలికి స్వల్ప గాయమైంది. అప్పట్లో ఈ దాడి ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఈ కేసులో స్వయంగా ఎన్టీఆరే కోర్టుకు హాజరయ్యారు. బాబ్జీని క్షమించాలని కోర్టును కోరారు. బాబ్జీ జైలు నుంచి 1985లో బయటికొచ్చాడు. గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్‌లో తోటమాలిగా పనిచేశాడు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లకు బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో రెండు పేజీల లేఖ దొరికింది. ఎన్టీఆర్‌పై దాడి చేస్తే 3లక్షలు ఇస్తామన్నారని కానీ 30వేలు మాత్రమే చెల్లించారని ఆ లేఖలో బాబ్జీ పేర్కొనడం గమనార్హం. బాబ్జీ మృతిపై విచారణ జరిపిన జస్టిస్ శ్రీరాములు కమిషన్ ఆ లేఖలోని అంశాలను బయటపెట్టింది. ఘటనకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ వివాదానికి తెర పడింది. తాజాగా జగన్‌పై దాడి ఘటనతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లోకి ఓ సాధరణ వంటవాడు లేదా వెయిటర్ కత్తితో ప్రవేశించాడంటే అది కచ్చితంగా పెద్ద లోపమే..అది కోళ్ళ పందాళ్ళో ఉపయోగించే చిన్న కత్తే కావోచ్చు కాని సరైన ఆయువు పట్టు మీద తగిలితే ప్రాణాలు తీసేంత పదును ఉన్నదే. ఇక సదరు రెస్టారెంట్ ఓనర్ టీడీపీ మనిషి అని గతంలో గాజువాక టిక్కెట్ ఆశించాడాని మరో ప్రచారం. ఇక టీడీపీ విచారణలపై ఎలాగూ నమ్మకం లేని జగన్ తానే తన సెక్యూరిటీ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here