Home Entertainment Television

జబర్దస్త్ కామెడీ షోలోకి నాగబాబు రీ ఎంట్రీ ఇస్తున్నాడా..? అసలు కారణాలు ఇవే!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క షోతో చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. చాలా మందికి లైఫ్ ఇచ్చిన షో కూడా. అందులో నాగబాబు కూడా ఉన్నాడు. చిరంజీవి తమ్ముడే అయినా కూడా ఈయన కూడా కెరీర్ లో చాలా లో పీరియడ్ లో ఉన్నపుడు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అక్కడ్నుంచి ఈయన కెరీర్ మారిపోయింది. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జబర్దస్త్ షో వచ్చింది. ఆ తర్వాత ఆయన నవ్వులే అతన్ని స్టార్ గా మార్చేసాయి. అక్కడ స్టేజీపై వచ్చే జోకుల కంటే కూడా నాగబాబు నవ్వులే హైలైట్ అయ్యాయి. ఆయన నవ్వుతుంటే జోకు రేంజ్ కూడా పెరిగేది.

అయితే మూడు నెలల కింద ఉన్నట్లుండి నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడు. దానికి చాలా కారణాలే చెప్పాడు ఈయన. ముఖ్యంగా మల్లెమాల టీంతో కూడా ఈయనకు విభేదాలున్నాయని అప్పుడే తెలిసింది. వాళ్లు తనను ఓలా.. కమెడియన్స్ ను మరోలా ట్రీట్ చేసేవాళ్లని.. సరిగ్గా పేమెంట్స్ కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. అంతేకాదు.. దర్శకద్వయం నితిన్ భరత్ పై కూడా చాలా కక్ష కట్టారని చెప్పుకొచ్చాడు. ఇలా ఎన్నో ఆరోపణలతో పాటు సంచలన వ్యాఖ్యలు కూడా చేసాడు నాగబాబు. ఇవన్నీ అయిపోయాయి.. ఇప్పుడు ఈయన అదిరింది షో చేసుకుంటున్నాడు కానీ దానికి రేటింగ్ రావడం లేదు. మొదలై ఆరు వారాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పెద్దగా మార్పులు కానీ..

ప్రేక్షకుల నుంచి మార్కులు కానీ రాలేదు అదిరింది షోకు. దాంతో రేటింగ్స్ కూడా దారుణంగానే వస్తున్నాయి. జబర్దస్త్ రిపీట్ ఎపిసోడ్స్ కు ఎక్కువ రేటింగ్ వస్తుంది కానీ అదిరింది మెయిన్ ఎపిసోడ్ మాత్రం తక్కువ రేటింగ్ తెచ్చుకుంటుంది. దాంతో నాగబాబుకు ఇప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నంత పనైంది. దాంతో ఇప్పుడు మళ్లీ బ్యాక్ టూ జబర్దస్త్ అంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఈ మధ్యే 3 మంకీస్ ట్రైలర్ లాంచ్ వేడుకలో గెటప్ శ్రీను కూడా ఇదే చెప్పాడు. త్వరలోనే నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తున్నారని కన్ఫర్మ్ చేసాడు. దాంతో జబర్దస్త్ ఫ్యాన్స్ మళ్లీ ఖుషీ అవుతున్నారు. ఈటీవీతో నాగబాబు అనుబంధం విడదీయరానిది. ఒక్క జబర్దస్త్ మాత్రమే కాదు ఇంకా చాలా కార్యక్రమాలకు ఆయన, రోజా కలిసి వస్తుంటారు. ఇప్పుడు బాబు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా నాగబాబు మళ్లీ వస్తే మాత్రం జబర్దస్త్ కళకళలాడటం ఖాయం. మరి ఆయనతో పాటు వెళ్లిపోయిన చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా మళ్లీ వస్తారా రారా అనేది చూడాలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here