Home Entertainment Television

నాగబాబు రీఎంట్రీకి మల్లెమాల నో

కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు ఎవరైతే సాయం చేశారో వాళ్ళని అసలు మరిచిపోకూడదు అంటారు. కానీ నాగబాబు మాత్రం మరిచిపోలేని విధంగా వాళ్లను విమర్శించాడు. ఆరెంజ్ సినిమా తర్వాత కెరీర్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో నాగబాబు బయటికి వచ్చేలా చేసింది జబర్దస్త్ కామెడీ షో. ఆరెంజ్ సినిమాతో అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో ఆయన కెరీర్ ను ఆదుకుంది జబర్దస్త్. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు నాగబాబు. వరుసగా సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అయితే తన కెరీర్ కు ఎంత సాయం చేసిన జబర్దస్త్ కామెడీ షోపై నాగబాబు ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జీ తెలుగులో అదిరింది కామెడీ షో లో అవకాశం రాగానే మల్లెమాల ప్రొడక్షన్స్ పై తీవ్ర విమర్శలు చేశాడు మెగా బ్రదర్. వాళ్లు కేవలం డబ్బు కోసమే జబర్దస్త్ కామెడీ షో నడిపించారని.. వాళ్లకు విలువలు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దాంతో పాటు అందులో ఉన్న మల్లెమాల ప్రొడక్షన్ టీంపై విరుచుకుపడ్డాడు నాగబాబు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జాలి దయ లేని కార్పొరేట్ కంపెనీలా మల్లెమాల ప్రొడక్షన్స్ తయారయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు నాగబాబు. అయితే ఈయన ఎంతో భారీగా ఊహించుకొని వెళ్ళినా అదిరింది PROGRAMME రేటింగ్స్ పరంగా చాలా దారుణంగా ఉంది. ఏ కోశానా కూడా జబర్దస్త్ కామెడీ షోతో ఇది పోటీపడలేకపోతుంది. దాంతో మళ్లీ నాగబాబు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గెటప్ శ్రీను లాంటి వాళ్లు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.

ఇదిలా ఉంటే నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కామెడీ షో లోకి రావడానికి మల్లెమాల ప్రొడక్షన్స్ ఆసక్తి చూపించడం లేదని.. వాళ్లకు నాగబాబు అవసరం లేదు అంటూ నో ఎంట్రీ బోర్డు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతి వారం కొత్త జడ్జిని తీసుకొస్తున్నారు కానీ నాగబాబు మాత్రం వద్దు అంటున్నారు. ఏదైనా ఒక చోటి నుంచి మరోచోటికి వెళ్లేటప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో వెళితే బాగుంటుంది కానీ పాత వాళ్ళపై విమర్శలు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పెరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here