Home Entertainment Television

అనసూయని ఫుట్ బాల్ ఆడుకుంటున్న నెటిజెన్స్! యాంకర్ ఏం చేసిందో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్‌గా.. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ అనసూయ. జబర్దస్త్ కార్యక్రమంతో ఈమె చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలు కూడా చేసింది.. ఇప్పటికీ చేస్తూనే ఉంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. సెలబ్రిటీ హోదా పొందిన తర్వాత కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వాటిని భరించక తప్పదు. ఇప్పుడు అనసూయ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామకు సోషల్ మీడియాలో వేధింపులు వస్తున్నాయి. ఈ మధ్యే ఈమె పోస్ట్ చేసిన ఓ ఫోటోని షేర్ చేసిన నెటిజన్ దానికి అసభ్యకర కామెంట్ పెట్టాడు. అక్కడితో ఊరుకోకుండా కొన్ని కామెంట్స్ కూడా చేసాడు ఈయన. దాంతో ఈ విషయాన్ని ట్విట్టర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది అనసూయ. అయితే నెటిజన్ పెట్టిన కామెంట్ తెలుగులో ఉండడంతో ట్విట్టర్ యాజమాన్యం ఇందులో ఎలాంటి రూల్స్ అతిక్రమణ లేదని తేల్చేసింది. దాంతో ఈ కామెంట్ చేసిన వ్యక్తి అకౌంట్‌ని క్లోజ్ చేయలేమని ట్విట్టర్ కూడా తేల్చేసింది.

దాంతో ఈమె ట్విట్టర్ రూల్స్ మార్చాల్సిందిగా కోరుతుంది. దాంతో పాటు దీన్ని సైబర్ క్రైంగా పరిగణించకపోతే మీదే తప్పు అని చెప్పడానికి కూడా నేను వెనుకాడను అని చెబుతుంది అనసూయ. ఇక ఈ విషయాన్ని స్రైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. కొందరు పోకిరీలు చేస్తున్న పనులతో తాను విసిగిపోయానని చెబుతుంది అను. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులని కోరింది. మొన్నటికి మొన్న కూడా తన ఫోటోను మార్ఫ్ చేసి పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ అప్ లోడ్ చేసారని ఫైర్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు మరోసారి తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడుతుంది. దీనిపై వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా స్పందించారు. ఈ క్రమంలో వారికి అనసూయ థ్యాంక్స్ తెలిపింది. ఏదేమైనా అనసూయకు ఈ మధ్యే ఇలాంటి వేధింపులు మరీ ఎక్కువైపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here