Home Entertainment Cinema

జాను ట్రైలర్ రివ్యూ.. శర్వానంద్, సమంత క్లాస్ లవ్ స్టోరీ.. Jaanu Trailer – Sharwanand Samantha

కొన్ని సినిమాలు తెలియకుండానే మనలో కలిసిపోతుంటాయి. అలాంటి సినిమా 96.. ఈ సినిమా తెలుగు కాదు కానీ తెలుగులో చాలా మంది ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసారు. ఎందుకంటే విడుదలైన రోజు నుంచి 96 సినిమా గురించి అంతగా మాట్లాడారు కాబట్టి. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని జాను పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. అక్కడ విజ‌య్ సేతుప‌తి, త్రిష జంటగా న‌టించారు. రెండేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం ఎన్నో అవార్డులతో పాటు రికార్డులు కూడా సాధించింది. ఈ సినిమా విడుదల కాకముందే నచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. అక్కడ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ చేసాడు. శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు

Jaanu Trailer – Sharwanand, Samantha

. ఎలాంటి హంగు ఆర్భాటలు లేకుండా జాను షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్ధమైపోయింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. తమిళ్ సినిమాను ఏ మాత్రం మార్చకుండా ఉన్నదున్నట్లు తెలుగులో రీమేక్ చేసాడు ప్రేమ్ కుమార్. అయితే ఒరిజినాలిటీ మిస్ కాకుండా తమిళ ఫ్లేవర్ కూడా అలాగే ఉంచేసాడు దర్శకుడు ప్రేమ్. అది మన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

శర్వానంద్, సమంత కూడా పూర్తిగా విజయ్, త్రిష పాత్రలను ఓన్ చేసుకున్నారు. సొంత స్టైల్ కూడా కనిపిస్తున్నా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు జాను కొత్తగా అనిపించదు. పైగా పొయెటిక్ టచ్ కూడా మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఆట్టుకుంటుందనేది పక్కనబెడితే కచ్చితంగా హృదయాన్ని తాకే మంచి సినిమా అవుతుందనేది మాత్రం అర్థమైపోతుంది. ట్రైలర్ లో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఫిబ్రవరి 7న జాను విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here