Home Entertainment Reviews

జాను మూవీ రివ్యూ Jaanu Movie Review

రివ్యూ: జాను
నటీనటులు: శర్వానంద్, సమంత అక్కినేని, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాత: దిల్ రాజు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ప్రేమ్ కుమార్

కొన్ని సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి ఓ సినిమా 96. కొన్నేళ్లుగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నంత మరే సినిమా గురించి మాట్లాడలేదు ప్రేక్షకులు. అలాంటి సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు దిల్ రాజు. చేసాడు కూడా.. మరి ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఆకట్టుకుంది..

కథ:
రామ్ ఉరఫ్ కే రామచంద్ర (శర్వానంద్) ట్రావెల్ ఫోటోగ్రఫర్. చదువు అయిపోయిన తర్వాత తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీలోనే స్థిరపడిపోతాడు. 15 ఏళ్లుగా ఎవర్నీ పట్టించుకోకుండా తన ప్రపంచంలోనే ఉంటాడు. అలాంటిది ఓ రోజు సడన్‌గా తన ఊళ్ళలో చదివిన స్కూల్‌కు వెళ్తాడు. పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చి మరోసారి రీ యూనియన్ ప్లాన్ చేసుకుంటారు 2004 బ్యాచ్. దానికి అంతా వస్తారు.. స్కూల్‌లో రామ్ ప్రాణంగా ప్రేమించిన జానకి దేవి (సమంత)తో సహా. అయితే స్కూల్ డేస్‌లో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న వీళ్లు అనుకోకుండా విడిపోతారు. దాంతో వదిలేసిన ప్రేమకథను రీ యూనియన్‌లో మళ్లీ గుర్తు చేసుకుంటారు.. కానీ అప్పుడు ఎందుకు విడిపోయారు.. తర్వాత కలుసుకున్నపుడు ఏం జరుగుతుంది.. అనేది అసలు కథ..

కథనం:
కొన్ని సినిమాలపై తెలియకుండానే భారీ అంచనాలు ఉంటాయి. అంతలా అందరిలోనూ ఆసక్తి పెంచేసిన సినిమా 96.. తెలుగులో జానుగా వచ్చింది ఇప్పుడు. తమిళనాట ఈ చిత్రం సంచలనం. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం అక్కడ క్లాసిక్ అయిపోయింది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేసాడు దిల్ రాజు. అయితే అందరూ చెప్పినంత క్లాసిక్ అనిపించలేదు కానీ.. అక్కడక్కడా మ్యాజిక్ మాత్రం కనిపించింది.. స్కూల్ లవ్ అందరికీ ప్రత్యేకమే.. అలాంటి పాయింట్ మీదే కథ రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. విడిపోయిన ప్రేమికులు మళ్లీ 15 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది అనే లైన్ తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. జానులో అంతకంటే కొత్తగా ఏమీ కనిపించలేదు కానీ.. స్కూల్ డేస్ గుర్తుచేస్తూ దర్శకుడు చేసిన స్క్రీన్ ప్లే మ్యూజిక్ అక్కడక్కడ బాగానే వర్కవుట్ అయినట్టు అనిపించింది. శర్వానంద్, సమంత కెమిస్ట్రీ చాలా బాగుంది.. ఫస్ట్ హాఫ్ అంతా రియూనియన్ పార్టీ.. సమంత ఎంట్రీ.. స్కూల్ బ్యాక్ డ్రాప్ తో పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఎమోషనల్గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎందుకో తెలియదు మరి.. ఈ సినిమా చూస్తుంటే సుమంత్ నటించిన మళ్లీ రావా గుర్తుకొచ్చింది. చాలా సన్నివేశాలు అందులో కనిపించినవే మళ్లీ ఇందులోనూ సేమ్ టు సేమ్ అనిపించాయి. ఒరిజినల్ వెర్షన్ ఎలా ఉందో చూడని వాళ్లకు కూడా జాను సినిమా మాత్రం అందరూ చెప్పినంత గొప్పగా అనిపించదు. మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నా కూడా.. స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్.. ఇలాంటి కథలు ఇలాగే ఉంటాయి అని సరిపెట్టుకోవాలేమో మరి.. శర్వానంద్ బాగా నటించాడు.. సమంత కూడా బాగుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ పెళ్లి గురించి మాట్లాడుకునే సీన్ అయితే బాగుంది. స్కూల్ ఏజ్ లో వచ్చే పిల్లలు అందరూ బాగానే నటించారు.. ఓవరాల్ గా 96 చూడని వాళ్లకు జాను పర్లేదు అనిపిస్తుంది. ఎమోషనల్ కథలకు కనెక్ట్ అయ్యే వాళ్లకు జాను మంచి ఛాయిస్.. మంచి సినిమానే కానీ గొప్ప సినిమా అయితే కాదు.

నటీనటులు:
శర్వానంద్ అద్భుతంగా నటించాడు. విజయ్ సేతుపతిని మరిపించడం కష్టమే కానీ తనవరకు బాగానే ప్రయత్నించాడు ఈయన. సమంత అక్కినేని కూడా త్రిష పాత్రను బాగానే ఓన్ చేసుకుంది. ఆ పాత్రలో త్రిష కనిపించింది. తన వరకు మార్క్ చూపించడానికి ట్రై చేసింది సమంత. వెన్నెల కిషోర్ కొంత వరకు నవ్వించాడు. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:
గోవింద వసంత్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ముఖ్యంగా ఆర్ఆర్ అదరగొట్టాడు. దాంతో పాటు పాటలు కూడా పర్లేదు అనిపించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ మాత్రం వీక్ అనిపించింది. కాస్త సాగదీసినట్లు అనిపించాయి సన్నివేశాలు. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎమోషనల్ లవ్ స్టోరీ బాగానే రాసుకున్నాడు కానీ కాస్త వేగంగా ఉంటే ఇంకా బాగుండేది. కానీ ప్రేమకథలు ఇష్టపడే వాళ్లకు జాను నచ్చేస్తుంది కానీ ఒరిజినల్ చూసిన వాళ్లకు మాత్రం రుచించదు.

చివరగా:
జాను.. ఎమోషనల్ లవ్ స్టోరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here