Home Entertainment Cinema

వరల్డ్ ఫేమస్ లవర్ ను విజయ్ దేవరకొండ పట్టించుకోవడం లేదా..

డియర్ కామ్రేడ్ సినిమాలు తర్వాత దాదాపు ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకొని వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా అయితే లేవు. విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే తక్కువ అంచనాల తోనే విడుదలకు సిద్ధమైంది వరల్డ్ ఫేమస్ లవర్. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ పెద్దగా పాల్గొనడం లేదని.. సినిమా విడుదల దగ్గరికి వస్తున్నా కూడా పట్టించుకోనట్లే ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దీని వెనుక రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వడమే కారణం అని తెలుస్తోంది.

నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే దాదాపు 5 నుంచి 8 కోట్ల వరకూ ఇస్తున్నారు నిర్మాతలు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అర్జున్ రెడ్డి తర్వాత సైన్ చేశాడు ఈయన. అప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే కోటి రూపాయలు విజయ్ దేవరకొండకు పెద్ద రెమ్యూనరేషన్. నిర్మాత కె.ఎస్.రామారావు కూడా ఆయనకు ఇదే మొత్తం ఇచ్చి ఈ సినిమాను పూర్తి చేశాడని తెలుస్తోంది. కానీ ఈ మూడేళ్లలో విజయ్ దేవరకొండ రేంజ్ పది రెట్లు పెరిగింది. దాంతో పాటే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు పాత పారితోషకం తీసుకున్నాడు ఈయన. అందుకే సినిమా రిలీజ్ దగ్గరికి వస్తున్నా కూడా అంటి ముట్టనట్లుగా విజయ్ దేవరకొండ ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా పెద్దగా ఇష్టం లేకుండానే హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఈయన మాత్రం పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాతో బిజీ అయిపోయాడు. దీన్నిబట్టి పారితోషికం విషయంలో విజయ్ దేవరకొండ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తుంది. మరి ఈయన అలక సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here