
కరెన్సీ నోట్లరద్దపై జరుగుగుతున్న ప్రచారానికి ఆర్బీఐ స్పందించింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఆర్బీఐ రద్దు చేస్తోందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆమూడు రకాల నోట్లు చెల్లుబాటు కావని ప్రచారం జరిగింది. దీనిపై ఆర్బీఐ ట్విట్టర్ వేధికగా వివరణ ఇచ్చిది..భవిష్యత్తులో రూ.100, రూ.10, రూ.5 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని..జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజంలేదని స్పష్టం చేసింది. తమకు రద్దు చేసే ఆలోచనలు ఏమిలేవని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

2016లో రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసిన కేంద్రం… రూ.100, రూ.10, రూ.5 నోట్ల జోలికి మాత్రం వెళ్లలేదు. అంతేకాక 2018లో రూ.10, రూ.50, 200 నోట్లను ముద్రించింది ఆర్బీఐ. 2019లో సరికొత్త రూ.100 నోట్లను తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే